అప్పుడే విగ్రహం పెట్టేశారు..! పవన్ ఫ్యాన్సా.. మజాకా..?

Arshu
పవన్ కళ్యాణ్ గా ప్రసిద్ధుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత మరియు రాజకీయవేత్త. ఆయన కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు, 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. తెలుగు సినిమా హీరోల్లో పవన్ కళ్యాణ్ ది డిఫరెంట్ స్టైల్. ఆయన ఏది చేసినా సెన్సేషనే. తన మూవీలతో కొత్త ట్రెండ్‌కు ‌సుస్వాగతం పలికిన పవన్ స్టార్. మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పచుకున్నాడు పవన్ కల్యాణ్. అన్నయ్య వారసత్వాన్ని తొలి రెండు సినిమాలకే పరిమితం చేసుకున్నాడీ తమ్ముడు. తనదైన స్టైల్‌తో, మేనరిజమ్స్‌తో తక్కువకాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఆయన అసలు పేరు కళ్యాణ్ కుమార్. స్క్రీన్ పై పవన్ కనిపిస్తే చాలు అభిమానులకు  జల్సాయే.


2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో తిరిగి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని పవన్ నేతృత్వంలోని జనసేన ఉవ్విళ్లూరింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం, ఆళ్ల‌పాడులో ఆదివారం జ‌రిగిన పుట్టిన‌రోజు వేడుక‌ల్లో అభిమానుల‌తో క‌లిసి జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌రప్ర‌సాద్ పాల్గొన‌నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, జ‌న‌సేన జెండాను ఎగుర‌వేశారు. కాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే... సినిమాలు కూడా చెయ్యాలన్నది ఆయన అభిమానుల ఆశ. ఎలాగూ... ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది. ఇప్పట్లో... ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి... మళ్లీ ఎన్నికలు నాలుగేళ్ల తర్వాతే (జమిలి ఎన్నికలైతే 2023లో) కాబట్టి... ఈ లోగా... రాజకీయాల్లో ఉంటూనే... మధ్యమధ్యలో సినిమాలు కూడా చెయ్యాలని కోరుతున్నారు ఆయన ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: