రోజా కు కీలక పదవి కట్టబెట్టిన జగన్..!
కులాల లెక్కల కారణంగా జగన్ మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. ఆమెకు జగన్ స్పీకర్ పదవి ఇస్తామని చెప్పినా.. రోజా అందుకు అంగీకరించలేదు. దీంతో రోజా చాలా అసంతృప్తిగా ఉన్నారని కథనాలు వచ్చాయి.
కానీ ఆమె తాజాగా జగన్ ను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. కానీ సోషల్ మీడియా లో ఊహాగానాలకు కొదవలేదు. ఇప్పుడు వాటికి పుల్ స్టాప్ పెడుతూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భోజనం ఆయన కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్గా నియమించారు. నామినేటెడ్ పోస్టుల్లో ఏపీఐఐసీ చైర్మన్ కు ఉన్న డిమాండ్ వేరు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించడం ఈ సంస్థ బాధ్యత. పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడంలో ఏపీఐఐసీకి చక్కటి అవకాశం ఉంటుంది.
మంత్రి పదవి మిస్సయిన రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ గా అవకాశం కల్పించడం మంచి నిర్ణయమే. ఈ పదవిలో రోజా రాణిస్తే ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు కూడా.