పేలిన జ"గన్'.. - సూటిగా.. సుత్తి లేకుండా..!

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం వైఎస్ జగన్ తన తొలి ప్రెస్ మీట్ ఢిల్లీలో నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన వాడిన భాష, ఇచ్చిన క్లారిటీ జర్నలిస్టులను ఆకట్టుకున్నాయి. వారంతా ఒక్కసారి చంద్రబాబు ప్రెస్ మీట్లను గుర్తు తెచ్చుకుని పోల్చుకుంటున్నారు. 


చంద్రబాబు ప్రెస్ మీట్ అంటే.. గంటలకు గంటలు కొనసాగుతుంది. అందులో ఆయన చెప్పదలచుకున్నదే తప్ప.. విలేఖరులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు రావు. చెప్పే సమాధానం కూడా డొంకతిరుగుడుగానే తప్ప నేరుగా ఉండదు.. ఏమన్నా అంటే.. వినయ్యా.. వినూ అనే హుంకారాలే ఎక్కువ. 

కానీ మొన్నటి జగన్ ప్రెస్ మీట్ అలా లేదు. జగన్ భాష చక్కగా, సింపుల్ గా ఉంది చూశారా? జగన్ ది వచ్చీ రాని ఇంగ్లీష్ కాదు. చక్కటి భాష. తెలుగులో కూడా నీట్ గా మాట్లాడారు. తెలుగులో గొప్ప పండితుడేమీ కాకపోయినా  చెప్పదలచుకున్నది స్పష్టంగా ముక్కుసూటిగా చెప్పారు. 

అడిగిన ప్రతిప్రశ్నకూ నేరుగా సమాధానం  చెప్పారు. ఏపీ వ్యవహారాలపైనా ఆయన గట్టిగానే ఉండబోతున్నారన్న సంకేతాన్ని స్పష్టంగానే ఇచ్చారు. మొదటి సమావేశంలోనే రాజధాని భూములు, పోలవరం వంటి కీలకమైన అంశాలపైనా స్పష్టమైన వైఖరి ప్రదర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: