15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అమెరికాకు చెందిన ఓ వ్యాపారవెత్త. దీంతో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మైనర్ బాలికపై సొంత జెట్ ఫ్లైయిట్‌లో ప్రయాణిస్తూ.. విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి మరీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
గతేడాది డిసెంబర్లో ఈ ఘటన జరిగగా.. విచారణ అనంతరం కోర్టు మంగళవారం శిక్ష విధించింది. 53 ఏళ్ల స్టీఫెన్ బ్రేడ్లీ మెల్ అనే వ్యాపార వేత్త మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో స్థానిక నిబందనల ప్రకారం మైనర్ తో అక్రమ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ వాటి నేరాల క్రింద ఇతనికి కోర్టు శిక్ష విధించినట్లు అక్కడి స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.
కాగా.. స్టీఫెన్ మెల్ ఓ బ్రోకరేజీ సంస్థ యజమాని. ఇతనికి సొంత విమానం ఉంది. ఈ నేపథ్యంలో బాధితురాలైన బాలిక తల్లి తన కుమార్తెకు పైలట్ లెస్సెన్స్ నేర్పించాలంటూ స్టీఫెన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే బాలికను ఒంటరిగా విమానంలో తీసుకెళ్లి స్టీఫెన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా.. స్టీఫెన్.. మరో లైంగికపరమైన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి తదుపరి తీర్పు జులైలో వెలువడనుంది.