నరేంద్రమోడీ సారధ్యంలోని బిజేపి ప్రభుత్వం సాధించిన విజయాలు తక్కువేమీ కావు!

ప్రాంతీయ విభేదాలను ప్రక్కనబెట్టి చూస్తే నరేంద్రమోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అద్భుతంగానే పనిచేసిందని చెప్పవచ్చు. వ్యక్తిగత ప్రాంతీయ ప్రయోజనాలను పరిశీలన లోకి తీసుకోకుండా చూస్తే విశాల ప్రయోజనాలకు మోడీ ప్రభుత్వం పెద్ద పీటే వేసింది. మరో రెండు నెలల్లో బిజేపి నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం ఐదేళ్లు కాలం పూర్తి చేసుకోబోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఏమిటో తెలుసుకోవటం అవసరం. 


పలు విమర్శలు ఉన్నా, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. దేశ ప్రగతి దిశ దశ ని మార్చే అనేక కార్యక్రమాలు అమలు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా భారత స్థానాన్ని ఎంతో గౌరవ ప్రథంగా నిలబెద్ట్టటం మాత్రమే కాదు సుస్థిర పరచింది. 



స్పష్టమైన పటిష్టమైన విదేశాంగ విధానం రూపకర్త బిజేపి


మోదీ సాధించిన అతిపెద్ద విజయాల్లో విదేశాంగ విధానం ప్రధానమైందిగా చెప్పవచ్చు. ప్రధాన మంత్రి భారత్ లో కన్నా విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారని ఆయన ఎప్పుడూ విదేశీ పర్యటన లోనే ఉంటారని విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన విదేశీ పర్యటనల వల్ల వివిధ దేశాలతో సంబంధాలు గతంతో పోలిస్తే చాలా బలపడ్డాయి. 

దక్షిణాఫ్రికా దేశాలను ఏకతాటి పైకి తీసుకురావడంలో విజయం సాధించారు. ఈ స్నేహానికి గుర్తుగా ‘సౌత్ ఏషియన్ శాటిలైట్’ ను అంతరిక్షంలోకి పంపించారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్య కలాపాలను వివిధ అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టారు. ఫలితంగా యూఏఈ వంటి ముస్లిం దేశాలు సైతం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా గళమెత్తాయి. 

విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతూ ఆసియా దేశాలను తన అధీనంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్న చైనాకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. చైనా పక్కలో బల్లెంలా ఉండే మంగోలియా వంటి దేశాలతో భారత్ కు సత్సంబంధాలు పెంచారు. 

అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆసియాలో రెండవ సూపర్ పవర్ గా భారత్ ను నిలబెట్టారు. ఈ చర్యల ఫలితంగా భారత్ లో అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్ల విదేశీ నిధులు రుణం రూపంలో వచ్చాయి.


అలజడులు జరుగుతున్నా పెరిగిన భద్రత గొప్పతనం బిజేపిదే!


గతంతో పోలిస్తే మోదీ ఐదేళ్ల హయాంలో సరిహద్దులో భద్రత పెరిగింది. సైన్యం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. వందల మంది ఉగ్రవాదులను ఏరి పారేసింది. 

రా, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలను పటిష్టపరచడంతో అంతర్గత భద్రత సైతం పెరిగింది. కశ్మీర్ లో అల్లర్లు, అంతర్గతంగా దాడులు తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వా లు అభివృద్ధి పనులపై దృష్టి సారించే అవకాశం కలిగింది.


మేకిన్ ఇండియా & డిజిటలైజేషన్ పెద్ద అడుగులు


గుండు సూది నుంచి యుద్ధ విమానం వరకు అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత దేశాన్ని వస్తువుల తయారీ కేంద్రంగా మార్చి, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేర్చాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా కార్యక్రమానికి రూపకల్పన చేశారు.  దీనికి ఊతమిచ్చేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. ఫలితంగా దేశంలో అనేక కొత్త కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగ కల్పనతో పాటు దేశ ఆర్థిక రంగానికి మేకిన్ ఇండియా కార్యక్రమం ఊతమిస్తోంది. 
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా ఆర్థిక రంగానికి భరోసా ఇచ్చింది. ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


స్వచ్ఛ భారత్ మిషన్ మామూలు విషయం కాదు!


నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్  మిషన్ ను ప్రకటించినప్పుడు భిన్నస్వరాలు వినిపించాయి. ఇది సాధ్యమేనా? అని అనుమానించినవారు కూడాఉన్నారు. కార్యక్రమా న్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. సెలబ్రిటీలు క్యాంపెయిన్లో క్యూ కట్టారు. 

ఇదంతా కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడంతో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఆలోచించడం మొదలుపెట్టాయి. 


పారిశుద్ధ్యం వల్ల కలుగుతున్న లాభాలను కళ్లారా చూసి, ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. ఫలితంగా రోడ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి సామూహిక ప్రాంతాలన్నీ ఇప్పుడు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పారిశుధ్యం, స్వచ్ఛత గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.


జీఎస్టీ చట్ట నిర్మాణం అమలు విజయం 


దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఒకే దేశం - ఒకే పన్ను విధానం మోదీ హయాంలో అమల్లోకి వచ్చింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వస్తు సేవల పన్ను - జీఎస్టీని ఏడాది కిందట అమలు చేశారు. దీంతో పన్ను వసూలు క్రమబద్ధీకరించబడింది. టాక్స్ పేయర్స్ సంఖ్య పెరిగింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడే వస్తువు ల ధరలు దిగివచ్చాయి. దీంతో పేదలపై భారం తగ్గింది.

అధికారంలోకి వచ్చిన ఎవరిపైనైనా విమర్శలు అనేవి సర్వసాధారణం. అలాగే మోదీపై కూడా పలు విమర్శలు లేకపోలేదు. ఈ విషయం పక్కనపెడితే పైన పేర్కొన్న కొన్ని  విజయాలతో నరేంద్ర మోదీ ప్రజల్లోకి  బలంగా వెళ్లగలుగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: