షాకింగ్..! జగన్‌ గుడివాడలో పోటీ చేస్తాడా..?

Chakravarthi Kalyan

ఏపీ ప్రతిపక్షనేత పార్టీ నేతలకు టికెట్ల పంపకంలో బిజీగా ఉన్నారు. టికెట్ల వ్యవహారం క్లోజ్ చేసి.. ఇక ప్రచారం జోరు పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఓ కొత్త విషయం బయటపడుతోంది. జగన్ ఈసారి రాజధాని ప్రాంతానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారని టాక్ వస్తోంది.

ప్రత్యేకించి గుడివాడ నియోజకవర్గంలో జగన్ పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ఇంతవరకూ కడప జిల్లా దాటి అందులోనూ పులివెందుల్లోనే పోటీ చేశారు. జగన్ బలమంతా రాయలసీమలోనే.. అందులోనూ కడప జిల్లాలోనే ఉందన్న విమర్శలు ఉన్నాయి.



అందుకే ఈ సారి కడప జిల్లా వెలుపల కూడా అసెంబ్లీకి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన కృష్ణా జిల్లాలోని గుడివాడను ఎంచుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడలో ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు.

జగన్ ను అమితంగా అభిమానించే కొడాలి నాని.. జగన్ కోరితే సీటు త్యాగం చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. కడప జిల్లాతో పాటు రాజధాని ప్రాంతంలో కూడా సత్తా చాటాలని జగన్ ప్రయత్నిస్తున్న సమయంలో గుడివాడలో పోటీ లాభిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ పులివెందుల, గుడివాడ రెండుచోట్లా పోటీ చేయవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: