గంప కింద మొత్తం – గుత్త కింద దొబ్బుడే : సమూల మార్పులే

        త్రినేత్రం కన్నుతెరిచింది...ఏమవుతుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే జరగబోతోంది. రాష్ట్రపరిస్థితులను,విషమస్థితిలో ఉన్న కాంగ్రేస్ ప్రాణాలను కాపాడేందుకు నియమించిన ముగ్గురు ఢిల్లీ వైద్యులు వైద్యపరీక్షలు పూర్తి చేశారు. రోగ నిర్ధారణ జరిగింది, ఇక నయం చేయడానికి ఢిల్లీ కి తరలించారు. ఆపరేషన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని సమాచారం.               సోకిన రోగం మాత్రం అధికారికంగా చెప్పకపోయినా పాత అవయావలన్నీ చెడిపోయాయన్న ప్రాథమిక నివేదిక మాత్రం తెలిసింది.వీటికి శస్త్ర చికిత్స చేసే బదులు అవయవ మార్పిడికే సిద్దమయినట్లు తెలిసింది. అంటే ఇప్పుడు అర్థమయిందనుకుంటా...జరుగబోయేదేదో.           మొత్తం ముఖాలే మారనున్నాయి.అందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయం మూడురోజులుగా బొత్స,రెండురోజులుగా చిరంజీవి,నేటినుంచి సిఎం ఢీల్లీ గల్లీల్లో చేస్తున్న హడావిడి స్పష్టం చేస్తోంది. మొత్తం రాష్ట్రకాంగ్రేస్ లో ప్రస్తుతం కీలకంగా ఉన్న పార్టీ,ప్రభుత్వ లీడర్లను పెద్ద మొత్తంలో గుత్త కింద గంప కింద తోసేసి కొత్త వారిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.              సిఎం,పిసిసి,కలంకిత మంత్రులు,కోవర్టులుగా ముద్రపడ్డ మంత్రులు,పార్టి పెద్దలు అందరిని తెలివిగా తప్పించేందుకు అంతా సిద్దమైందట. సిఎం ను మార్చడం ద్వారా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పేరుతో హిట్ లిస్ట్ లోని మంత్రులను, పిసిసి అధ్యక్షుని మార్పు ద్వారా పార్టీ బలోపేతం కోసం కొత్త నిర్ణయాలు కమిటీల పేరుతో పార్టీ లీడర్లను వారి పదవులను మార్చి ఇంటా బయట చెడ్డపేరు రాకుండా ఉండేలా చూస్తూ ఈసమూల మార్పులు చేయనున్నారు. చాలారోజులుగా సుస్థీతో వ్యాది ముదిరి పరిస్థితి విషమించిన తర్వాత చేస్తున్న ఈ ఆపరేషన్ ఫలిస్థుందా...వికటిస్థుందా..అంటూ ఆందోలనతో స్వపక్షం, ఆతృతతో విపక్షాలు ఎదురుచూస్థున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: