మరికొన్ని గంటల్లో ఉప ఫలితాలు:టెన్షన్ టెన్షన్....

 హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ర్టంలోని పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు కు ఈ నెల12న పోలింగ్ జరిగిన విషయం విధితమే. ఓట్ల లెఖ్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెఖ్కింపు ప్రారంభమవుతోంది. ఎలక్ర్టానిక్ యంత్రాలు కావడం వల్ల మధ్యాహ్నంకల్లా ఫలితాలు వస్తాయి. ఇదిలా ఉంటే, ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లలో తేలిపోనున్నది. ఓట్ల లెఖ్కింపుకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఒకటే టెన్షన్. గెలుపుపై పైకి మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోలోపల మాత్రం ఏదో తెలియని భయం. గెలుస్తామా? ఓడిపోతామా? అనేది అన్ని పార్టీల అభ్యర్థులను పట్టిపీడిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. మండుతున్న ఎండల్ని సైతం లెఖ్క చేయకుండా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి ప్రచారం నిర్వహించడంతో ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చిన అభ్యర్థుల భవిష్యతే కాదు, పార్టీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనున్నది. మొత్తానికి ఓట్ల లెఖ్కింపుకు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: