టీడీపీ తో రహస్య బంధం మెయింటైన్ చేస్తున్న జనసేన: విజయసాయిరెడ్డి..!

KSK
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చంద్రబాబు అధికారంలోకి రావడానికి కొంత కృషి చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం మార్చి నెలలో తెలుగుదేశం పార్టీ కి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుని బయటకు రావడం జరిగింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరచాటున చంద్రబాబుతో తన రహస్య బంధం కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి.


ఇందుమూలంగా అనే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దారుణంగా విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు చాలామంది వైసీపీ పార్టీ నేతలు. అంతేకాకుండా జనసేన పార్టీ తరఫున నిర్వహిస్తున్న ప్రజాపోరాట యాత్రలో జగన్ తండ్రి వైయస్సార్ పరిపాలన గురించి దారుణమైన విమర్శలు ఇటీవల పవన్ కళ్యాణ్ చేసినట్లు సమాచారం.


ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన లో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రశ్నించాల్సిన చంద్రబాబుని పోయి జగన్ ని పవన్ కళ్యాణ్ విమర్శించడం బట్టి చూస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటే అని అర్థమవుతోందని అంటున్నారు వైసీపీ నేతలు.


మరోపక్క జగన్ పై ఇటీవల తన ప్రజాపోరాట యాత్రలో కులం గురించి మరియు ఆయన మగతనం గురించి పవన్ కళ్యాణ్ దారుణంగా కామెంట్లు చేసిన క్రమంలో..జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రలో పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగిపోయే విధంగా కౌంటర్లు వేయడంతో ఆ కౌంటర్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతున్నాయి. జగన్ చేసిన కామెంట్లలో తప్పేమీ లేదని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిస్తే జనసేన పార్టీ కంటే తన అన్న చిరంజీవి స్థాపించిన కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన ప్రజారాజ్యం పార్టీ యే బెట్టర్ అని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: