ఆంధ్రప్రదేశ్ విశిష్టత..ముఖ్యమై మైలురాళ్లు!

Edari Rama Krishna

ఆంధ్రప్రదేశ్ విశిష్టతను.. చరిత్రలోని మైలురాళ్లను ఓసారి గుర్తు చేసుకుందాం....

- స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

-1956 నవంబర్‌ 1న 23 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అవతరణ.

- తొలుత 20 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్

- 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఏర్పాటు


- 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా ఏర్పాటు

-1979 జూన్ 1న విజయనగరం జిల్లా ఏర్పాటు

- 10 తెలంగాణ జిల్లాలు, 9 కోస్తాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు

- 1956 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సరిగ్గా 56 ఏళ్ల తర్వాత విభజన.

- దేశ జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఐదో అతి పెద్ద రాష్ట్రం.

- విస్తీర్ణంలో నాలుగో అతి పెద్ద రాష్ట్రం.

- మొదటి ముఖ్యమంత్రి -నీలం సంజీవరెడ్డి

- మొదటి స్పీకర్ - అయ్యదేవర కాళేశ్వరరావు

- చివరి స్పీకర్ - నాదెండ్ల మనోహర్

-1956 నుంచి 1983 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఎదురేలేదు.


-1969లో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం-400 మంది బలి

- ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమం

- 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నఎన్టీఆర్‌

- మొత్తం మీద 15 ఏళ్లపాటు అధికారంలో తెలుగుదేశం

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి  చివరి సీఎం - నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి

- మొదటి, చివరి ముఖ్యమంత్రులిద్దరూ రాయలసీమవాసులే

- రాష్ట్రంలో రెండుసార్లు రాష్ట్రపతి పాలన

- 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీ.ఎం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం

- మొత్తం 22 మంది గవర్నర్లుగా పనిచేశారు.

-మొదటి గవర్నర్‌ CM త్రివేది

-చివరి గవర్నర్‌ ఈఎస్‌ ఎల్‌ నరహింహన్  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: