నవయుగ గౄప్ కంపెనీలపై ఐటి దాడుల ఝలక్-ఏపిలో అధికార టిడిపికి షాక్!

ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తమకు దగ్గరైనవారికి తమ సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే అందలమెక్కించే ప్రయత్నంలో సేవలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం అయింది. ఇతర సామాజిక వర్గాలకు కనీస ప్రాతినిధ్యం కనిపించేలాలేని పరిస్థితులు కనిపించతం లేదని అంతున్నారు. కాంట్రాక్తులు, పరిశ్రమలు, సమాచార రంగం, సినిమాలు, ప్రదర్శనరంగం, ప్రభుత్వ ప్రయివేట్ ప్రోజెక్ట్స్ ఎక్కడ చూసినా, ఎవర్తిని పలకరించినా ఒకే సామాజిక వర్గం పేరు వినిపిస్తుంది. వేరే ఎవరికైనా ప్రయోజనం ఉందీ అంటే అధికార పార్టీలో ప్రముఖులకు మాత్రమే. 

పోనీ వీళ్ళు సరిగ్గా పని చేస్తున్నారా అంటే ఆదాయపు పన్ను ఎగవేతలు, అసలు పనికి నూరు రెట్లు కోట్ చేసే కాంట్రాక్టులు సొంతం చేసుకోని అసలే ఆర్ధిక అంధకారంలో మ్రగ్గే రాష్ట్రాన్ని నష్టాల ఊబిలోకి త్రోసేసే ప్రభుత్వం. ఇవన్నీ అయోమయ వాతావరణం సృష్టిస్తున్నాయి.   
 

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా సాగిపోదన్నట్లు - ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వానికి అందులోని అధినేతలకు అత్మీయ కంపెనీగా మారిన నవయుగ పై ఆదాయపన్నుశాఖ దాడులు జరిగాయి. ఇప్పటికే ఐటిదాడులు అంటే వణుకుతున్న టీడీపీకి ఇది మరోషాక్ అనే చెప్పొచ్చు. నవయుగ సంస్థ ఏపీలో వేలాది కోట్ల రూపాయల పనులు చేస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ పెద్దలకు ఎంతో సన్నిహితంగా ఉంది. హైదరాబాద్ లోని నవయుగ తో పాటు కంపెనీకి చెందిన పలు సంస్థల్లో  ఈ సోదాలు సాగుతున్నాయి. 

పోలవరం ప్రాజెక్టులో కీలకపనులు కూడా ఈ సంస్థకు అప్పగించారు. నవయుగకి చెందిన 47కంపనీలపై ఆరా తీస్తున్న ఐటీ అధికారులు, గత నాలుగేళ్లుగా ఐటీ రిటర్న్, ప్రాజెక్టుల నిర్వహణపై విచారణ చేస్తున్న ఐటీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలు ఉల్లగించారని ఆరోపణలు కంపెనీ ఎదుర్కొంటోంది.

నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్ తో పాటు, నవయుగ  బెంగళూరు టోల్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీ గండ్ ఎక్స్-ప్రెస్ వే కంపెనీలపై ఆరా  కృష్ణా డ్రైడ్జింగ్ కంపెనీ లిమిటెడ్ , కృష్ణ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ , శుభం కార్పొరేషన్ ప్రై. లిమిటెడ్, నవయుగ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, నవయుగ  స్పేషియల్ టెక్నాలజీస్  లిమిటెడ్, నవయుగ ఇంఫోటెక్ లిమిటెడ్ లావాదేవీలపై ఆరా తీస్తున్న ఆదాయపు పన్ను అధికారులు. 

కొత్తగా వేలాది కోట్ల రూపాయల పనులు కూడా ఈ సంస్థకు సర్కారు అప్పగించటానికి సిద్ధమయ్యారు ఏపిలోని ప్రభుత్వ పెద్దలు. ఈ కంపెనీపై కొద్ది రోజుల క్రితమే ఆర్-వోసీ అధికారులు దాడులు చేసి డిస్-ప్లే బోర్డులు కూడా లేకుండా పదుల సంఖ్యలో ఒకే అడ్రస్ లో ఉన్నట్లు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: