‘ఆ ముగ్గురు’

  హైదరాబాద్: రాష్ర్టంలో క్షీణ దశలో ఉన్న రాష్ర్ట కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేసి బతికించడానికి పార్టీ అధిష్టానం కేంద్రంలోని ఆజాద్, వాయిలార్, ఆంటోనిలను నియమించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ముగ్గురు త్వరలోనే రాష్ర్టానికి రానున్నుట్లు సమాచారం. రాష్ర్టంలో నెలకున్న పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయనున్నారు.నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ఓ నివేదికను సోనియాకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  అయితే, రాష్ర్టాన్ని ప్రధానంగా పీడిస్తున్న సమస్యల్లో ఒకటవది రాష్ర్ట విభజన, రెండోవది నాయకత్వ మార్పు, మంత్రులపై సీబీఐ అభియోగాలు. రాష్ర్టానికి వస్తున్న హేమాహేమీలైన ఈ ముగ్గురు రాష్ర్ట నాయకత్వం మార్పుపై మాట్లాడుతారా? లేక, రాష్ర్ట విభజన గురించి మాట్లాడుతారా? ఇవి కాకుండా, ఈ సమస్యల పరిష్కరానికి మరేదైనా కొత్త చిట్కా గురించి మాట్లాడుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, టీఆర్ఎస్కు ఉన్న సమాచారం ప్రకారం...రాష్ర్ట విభజనకు సంబంధించి ఈ ముగ్గురు నాయకులు హైదరాబాద్కు వస్తున్నారనుకుంటోంది.  కాంగ్రెస్ పార్టీకి బలమైన రాష్ర్టం ఆంధ్రప్రదేశ్. ఈరాష్ర్టం కాంగ్రెస్ ఖాత నుంచి ‘చే’జారిపోతుందనే భయం కాంగ్రెస్ అధిష్టానానికి పట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీనితో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లయిన ఆజాద్, రవి, అంటోనిలకు రాష్ర్ట బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనకు రానున్న ఆ ముగ్గురు పర్యటనపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. అస్తవ్యస్తంగా మారిన రాష్ర్ట కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి అధిష్టానం ఈ ముగ్గరు నాయకులను ప్రయోగిస్తున్నది. ఇదిలా ఉంటే, గత జూన్ నెలలో రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో వాయిలార్ రవి, ఆజాద్ పాల్గొన్నారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజక వర్గాల్లో గల్లీగల్లీకి తిరిగారు. ఫలితాల సరికి వచ్చే సరికి కాంగ్రెస్ బొక్కాబోర్లపడ్డది. మళ్లీ ఈ దఫా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆజాద్, రవితో కలిపి ఆంటోనికి రాష్ర్ట రాజకీయాలను సరిచేసే బాధ్యతల్ని అప్పగించింది. 18అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజక వర్గాలలోనే నెగ్గించుకోరాలేనీ, సదరు నాయకులు పతనావస్థ దశలో ఉన్న రాష్ర పార్టీని, సర్కార్ను, రాష్ర్ట విభజనను చక్కబెడతారా? అనేది కూడా రాష్ర్ట రాజకీయాల్లో హాట్ హాట్ టాఫిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటు వంటి రాష్ర్టం ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏమిటి అనే దానిపై ఈ ముగ్గురు నాయకులు రాష్ర్టంలో పర్యటించి లోతుగా అధ్యయనం చేసి సోనియాకు నివేదికను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  అయితే, ఇప్పటికే రాష్ర్టానికి చెందిన పలువురు ఎంపీలు రవి,ఆజాద్ లను కలిసి రాష్ర్ట రాజకీయాలపై ద్రుష్టిని పెట్టాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ఎంపీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ర్ట విభజన వైపు మొగ్గు చూపరాదనీ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు కూడా తెలంగాణ ఇవ్వల్సిందేనంటున్నారు. వీరు కూడా కాంగ్రెస్ పెద్దలను కలసి రాష్ర్టాన్ని ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ రాదు, సీమాంధ్రలో రాదనీ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ర్ట కాంగ్రెస్కు చికిత్స చేసేందుకు ఢిల్లీలోని టెన్ జన్ పథ్ ఈ ముగ్గురు నాయకులను నియమించింది. ఇప్పటికే ఇండియాటుడే, నీల్సన్ చేసిన సర్వేలు రాష్ర్టంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ రోజు రోజుకూ బలహీన పడుతుందనీ చెప్పింది. రాష్ర్ట పరిస్థితులను చక్కబెటట్టడానికి అధిష్టానం నియమించిన ఈ ముగురు నాయకులు ఏమేరకు రాష్ర్ట కాంగ్రెస్ పార్టీని, సర్కార్కు, విభజన పరిష్కార మార్గాలు చూపుతారో చూడాలి మరి.       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: