క్రీస్తు పునరుత్థానమే ఈస్టర్..చాలా ఉత్తమమైనది

Edari Rama Krishna
ఈస్టర్ క్రైస్తవులకు అతి పెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన క్రీస్తు పరమ పదించిన మూడు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఆయన మళ్ళీ ప్రాణాలతో వచ్చారు. దీంతో ప్రజలు హర్షోల్లాసం ప్రకటించి ఆనందంలో మునిగి తేలియాడారు. ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.  ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను గుడ్‌ఫ్రైడే గడిచిన రెండు రోజులు తరువాత జరుపుకుంటారు.

ఈస్టర్ రుతువు 40రోజులు :
క్రీస్తు మరణం, పునరుత్థానం కాలం క్రీ.శ 26 మరియు క్రీ.శ 36 మధ్య జరిగినట్లు వివిధ వాఖ్యానాలు ఉన్నాయి. ఈస్టర్ ఇంకా ఈస్టర్ టైడ్ లేదా ఈస్టర్ రుతువు అని పిలువబడే చర్చి సంవత్సరం యొక్క రుతువును కూడా సూచిస్తుంది. ఈ సంప్రదాయ ప్రకారం ఈస్టర్ రుతువు ఈస్టర్ దినం నుంచి ప్రారంభమై ఆరోహణ దినంగా పిలువబడే రోజు వరకు 40రోజుల వరకు ఉంటుంది.

కానీ ఇపుడు అధికారికంగా పెన్తెకొస్తు వరకు 50రోజులు కొనసాగుతుంది. ఈస్టర్ తేదీ మార్చ్ 22 నుండి ఏప్రిల్ 25 మధ్య మారుతూ ఉంటుంది.ఈస్టర్ పండుగను క్రిస్మస్ పండుగలాగా ఘనంగా జురుపుకోరు. ఆయినాకూడా క్రిస్టియన్ల పండుగలలో ఇది చాలా ఉత్తమమైనది. ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం నాడు "గుడ్ ఫ్రైడే"గా జరుపుకుంటారు. ఈ పండుగరోజే యేసును శిలువచేశారు. ఆ రోజు క్రిస్టియన్లందరూ నల్లటి వస్త్రాలను ధరిస్తారు. దీంతో వారు తమ సంతాపం వ్యక్తం చేస్తారు


నూతన మార్గంలో పయనిస్తారని నమ్మకం :
బైబిల్‌లోని కొత్త నిబంధన ప్రకారం ఏసు పునరుత్థానం చెందిన రోజున ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది. దేవుడు ఈ ప్రపంచాన్ని న్యాయబద్ధంగా నిర్ణయిస్తాడని ఈ పునరుత్థానం చూపబడింది. క్రైస్తవులు దేవునిపై విశ్వాసంను ఉంచడం ద్వారా క్రీస్తుతో పాటు అధ్యాత్మికంగా పునరుత్థానం చెంది జీవితాన్ని నూతన మార్గంలో పయనిస్తారని నమ్మకం.


జాగరణతో ఆరంభిస్తారు : శనివారం రాత్రి జాగరణతో ఈస్టర్ ప్రారంభమవుతుంది. శనివారం సాంప్రదాయకంగా ఈస్టర్ గుడ్లను రంగులతో అలంకరించడంతో గడుపుతారు. అలంకరించిన గుడ్లను పెద్దలు పిల్లలకు కనిపించకుండా ఇంట్లోగాని తోటలోగాని దాచి పెడతారు.ఆదివారం ఉదయం అప్పటికే రహస్యంగా దాచిన గుడ్ల కోసం పిల్లలు ఇల్లు, తోటలను వెతుకుతారు. కొన్ని సంప్రదాయల్లో తల్లిదండ్రులు పిల్లలు నిద్ర లేచేటప్పటికీ వారికి ఇష్టమైనవి బహుమతిగా ఇస్తుంటారు.ముందుగా ప్రార్థనలలో పాత నిబంధనలోని వాక్యాలను చదువుతారు. 


తెల్లవారుజామున ప్రార్థనలు : 
 ఆదివారం తెల్లవారు జామున సమాధి వద్దకు వచ్చే స్త్రీ సువార్తీకులను దృష్టిలో ఉంచుకుని ప్రార్థనలను అర్ధరాత్రి కాకుండా తెల్లవారు జామున చేస్తారు. ప్రార్థన సేవకు హాజరవడం, మధ్యాహ్నం సమయంలో విందు జరుపుకుంటారు. పదకొండు మంది శిష్యులను సూచిస్తూ పదకొండు మర్జిపాన్ బంతులతో కూడిన ఫ్రూట్ కేక్ వంటి ఈస్టర్ బ్రెడ్‌లను, శిలువతో కూడిన వేడి రొట్టెలు వడ్డించబడతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: