మహారాష్ట్రలోని పుణేలో ఓ భార్య బాగోతం కలకలం రేపింది. భర్త ఆఫీసుకు పంపి మరో వ్యక్తితో కులకడం ఏకంగా వీడియో రూపంలోనే దొరికిపోయింది. మరో వ్యక్తితో గుట్టు సాగిస్తున్న అక్రమ సంబంధం భర్త చాకచక్యంతో వెలుగు చూసింది. పూణే నగరంలోని అంబేగామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలన్న భర్త ప్రయత్నం ఫలించింది.
వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న భర్తకు భార్య తీరుపై అనుమానం వచ్చింది. తన ఇంటికి తాను లేనప్పుడు ఎవరో వస్తున్నారని తన కొడుకు మాటల ద్వారా గ్రహించాడు.. అనుమానం వచ్చి ఇంటి నిండా సీక్రెట్ కెమేరాలు ఉంచాడు. ఈ విషయం తెలియని భార్య ఎప్పటిలాగానే భర్త ఆఫీసుకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
కామక్రీడల్లో మునిగితేలింది. ఈ తతంగమంతా సీక్రెట్ కెమేరాల్లో నిక్షిప్తమైపోయింది. భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక సీక్రెట్ కెమేరా ఫుటేజ్ చూసి షాక్ తిన్నాడు. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నిర్దారణకు వచ్చాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా తనకు విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లాడు. పక్కా ఆధారాలు లభించడంతో కోర్టు అతని వాదనతో ఏకీభవించింది. భర్తకు విడాకులు మంజూరు చేసింది.