బాలకృష్ణ అక్కడ గెలిస్తే.. అర గుండు కొట్టించుకుంటాడట..!

Chakravarthi Kalyan
ఇంకా పూర్తిగా 2018లోకి కూడా అడుగుపెట్టకుండానే ఆంధ్ర, తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు సంబంధించిన సవాళ్లు, ప్రతిసవాళ్లు ప్రారంభం అయ్యాయి. ఏపార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి.. ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారు.. వంటి వివరాలు ఆసక్తికరంగా మారాయి. దీనికితోడు వీఐపీల స్థానాలపై ఫోకస్ క్రమంగా పెరిగింది. 


ఏపీ సీఎం బావమరిది, ప్రముఖ నటుడు బాలకృష్ణ గత ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికైన సంగతి తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బాలకృష్ణ అదే స్థానం నుంచి బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఐతే.. హిందూపురంలో ప్రస్తుతం బాలకృష్ణకు అంత సానుకూలమైన పరిస్థితి కనిపించడం లేదు. సీఎం బావమరిది అయి ఉండి కూడా బాలయ్య హిందూపురానికి ప్రత్యేకంగా చేసిందేమీలేదన్న టాక్ ఉంది. 


దీనికితోడు..గత వేసవిలో ఇక్కడి ప్రజలు దాహార్తితో ఇబ్బందిపడినా ఎమ్మెల్యేగా బాలకృష్ణ పట్టించుకోలేదన్న వార్తలు హల్ చల్ చేశాయి. నీటి కోసం ప్రజల ఆందోళనలు చేయడం రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ హిందూపురానికి చుట్టపుచూపుగా రావడం తప్పించి.. ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదన్న అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ హైలెట్ చేస్తోంది.  అంతేకాదు.. ఇక్కడి వైసీపీ నేతలు ఇప్పటి నుంచే బాలయ్యకు సవాల్ విసురుతున్నారు. 


వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణపై తాను గెలవకపోతే అరగుండుతో ఊరేగుతానని వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శపథం చేసారు. అసలు తాను 2009 ఎన్నికల్లోనే ఎమ్మెల్యేను కావాల్సిందని, కానీ.. రఘువీరారెడ్డి వల్లే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు టికెట్ కేటాయించలేదని నవీన్ అంటున్నారు. బాలకృష్ణ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. 2019లో బాలకృష్ణను ప్రజలు నమ్మబోరని నవీన్ చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: