కాంగోలో ఘోర రైలు ప్రమాదం..!

Edari Rama Krishna
కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 33 మంది మృతి చెందగా.. 26మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది. సంఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని లుబుడి ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అక్కడి అధికారుల సమాచారం మేరకు 13 ఆయిల్‌ ట్యాంకర్లతో ఓ రైలు లుబుంబాషి నుంచి కటంగాలోని లుయేనా వెళ్తొంది. లుబుడి స్టేషన్‌ సమీపంలో ఈ రైలు అదుపుతప్పి లోయలో పడింది.

రైల్లో ఆయిల్‌ ట్యాంకర్లు ఉండటం వల్ల బోగీలకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ‘ప్రమాదానికి గురైన రైల్లో ప్రయాణికులకు అనుమతి ఉండదని,అది కేవలం ఆయిల్‌ ట్యాంకర్లను తీసుకెళ్లేందుకు మాత్రమే ఏర్పాటుచేసిన రైలు కాబట్టి మృతులంతా ఆ రైల్లో అక్రమంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని అధికార్లు తెలిపారు.

కొన్నిసార్లు కొందరు ప్రజలు అధికారుల కళ్లు గప్పి రైల్లో వెళ్తుంటారు. వారిని అక్రమ ప్రయాణికులుగా పరిగణిస్తాం. ఈ ప్రమాదంలోని మృతులు కూడా అలా ఎక్కిన వారే అయి ఉంటారు’ అని జాతీయ రైల్వేకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.  ఆయిల్ ట్యాంకర్లు తీసుకెళ్లే రైలులో ప్రయాణికులకు అనుమతి  లేదు. అయితే వీరంతా అక్రమంగా ప్రయాణిస్తున్న  ప్రయాణికులేనని అధికారులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: