అకల్‌తక్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు..తృటిలో తప్పిన ప్రమాదం..!

Edari Rama Krishna
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉగ్రవాదం పెచ్చుమీరిపోయింది.  ముఖ్యంగా అరబ్ దేశాల్లో ప్రతిరోజు ఉగ్రవాదుల చేతుల్లో ఎంతో మంది అమాయకులు బలిఅవుతూనే ఉన్నారు..ఎప్పుడు ఏక్కడ ఏ క్షణంలో బాంబులు పేలుతాయో..ఉన్మాదుల్లా వచ్చి ఊచకోతలు కోస్తారో అన భయం గుప్పిట్లో అక్కడి ప్రజలు బతుకుతున్నారు.  

అక్కడే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచే ఉంది.  తాజాగా అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న అకల్‌తక్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం రేగింది. ఈ సారి యూపీలో ఉగ్రవాదులు ట్రైన్‌ను టార్గెట్‌ చేశారు. అమృత్‌సర్‌ వెళ్తున్న అఖల్‌తక్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టారు. కాశ్మీర్‌లో హతమైన ఉగ్రవాది దుజానా ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే ఈ బాంబు పెట్టినట్టు లేఖ వదిలి వెళ్లారు.

ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి దాటాక బాంబు పెట్టారనే సమాచారంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే తనిఖీలు చేపట్టి గోనె సంచిలో మూటకట్టి ఉన్న పేలుడు పదార్థాలతో పాటు రెండు లైటర్లను స్వాధీనం చేసుకున్నారు.  అప్రమత్తమైన రైల్వే పోలీసులు... బాంబును నిర్వీర్యం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: