చిరు మదిలో మెగా అనుమానం : ఆఖరు వరకు ఆపద్భాంధవుడే

చిరు మదిలో మెగా అనుమానం మొదలైంది. ఇక ఆఖరు వరకు ఆపద్భాంధవుడి పోస్టు ఖరారైనట్టేమోనని ఆయన భావిస్తున్నారట. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి మరి. నిజమే మరి ఎందుకంటే సినిమారంగంలో ఆయన సాధించిన బిరుదులు,తీసిన సినిమాలు రాజకీయరంగంలో అచ్చుగుద్దినట్లు అతుకుతున్నా సినిరంగంలోని స్టార్ ఒక్కటే రాజకీయాల్లో అచ్చి రావడం లేదు. పార్టీపెట్టి తొలి ప్రయత్నంలోనే 18 స్థానాలు గెలిచి విజేత గా ఆవిర్భవించారు, కాని సిఎం పోస్టుకు విన్నర్ కాలేకపోయారు. వైఎస్ఆర్ మరణంతో జగన్ రూపంలో ప్రభుత్వానికి ఆపదరాగా ఆయన కాంగ్రేస్ కు ఆపద్భాంధవుడు అయ్యారు.సర్కారు కూలకుండా ఆపి రాష్ట్రరాజకీయాల్లో మెగాస్టార్ అయ్యారు.ఉపఎన్నికలు వస్తే ప్రచారంలో ఊపునిచ్చే నేత లేక కాంగ్రేస్ ఉసూరుమంటున్న తరుణంలో చిరంజీవి సిని గ్లామరే చివరికి దిక్కయింది.అప్పుడు కూడా ఆయనది ఆపద్భాంధవుని పాత్రే. అయితే అది అట్టర్లీ ప్లాప్ అయింది.ఒక్కహిట్టుతో సినిమారంగంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగారో,ఒక్క ప్లాఫ్ తో రాజకీయాల్లో ఆయన అంగులం కూడా ముందడుగు వేయలేకపోతున్నారట. ఉపఎన్నికలు ప్లాప్ కావడంతో చిరంజీవి విషయంలో కాంగ్రేస్ అధిష్టానం కాస్త ఆలోచనలో పడిందట. ఆయన ఇమేజ్ ప్రజల్లో పనికొస్తుందనే భావనపై పార్టి పునరాలోచనలో పడిందట.అందుకే అవసరమున్నప్పుడల్లా ఒకసారి సిఎం పదవిని,మరోసారి కేంద్రమంత్రి పదవిని ఎరగా పెట్టి ఆపద్భాందవుడిలా ఉపయోగించుకుని ఇప్పుడు ఆయనను వదలకుండా,ఇలాగే కొనసాగిస్తూ రకరకాల కారణాలను బొంకుతూ అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలన్న ఆలోచన పార్టి అధిష్టానంలో ఉందని తెలుస్తోంది. చిరంజీవికి కూడా ఇప్పుడిప్పుడే ఈఅనుమానం మొదలైందట. సిఎం పోస్టు ఇవ్వలేదు,ఉపఎన్నికల తర్వాత కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదు, దీనికి సాకుగా చూపిన రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా పూర్తయ్యాయి.అయినా ఆ ఊసేలేదు.పైగా మంత్రుల మద్య తగాదాలు,కేంద్రానికి ,రాష్ట్రానికి మద్య జరుగుతున్న యుద్దం, పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాలు, మల్లీ లేచిన తెలంగాణవాదం ఇలా చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వకుండా చూపేందుకు సాకులు కూడా సవాలక్ష ఉన్నందున ఆయనకు విశ్వనాథ్ దర్శకత్వంలో హిట్టందించిన ఆపద్భాందవుడు సినిమా టైటిల్ ఆఖరుదాకా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: