హైదరాబాద్: యువనేత రాహూల్ గాంధీని ప్రభుత్వంలోకి రావాల్సిందిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆహ్వానించారు. గత నెలలో పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా క్రీయాశీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహూల్ గాంధీ ప్రకటించిన విషయం విధితమే. రాహూల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తానంటే అప్పగించడానికి తానూ సిద్దంగా ఉన్నట్లు రాహూల్ తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. బాధ్యతలు చేపట్టటడానికి తాను సిద్దమనీ రాహూల్ అనడం, సోనియా ఓకే చెప్పడంతో రాష్ర్టపతిగా వెళ్లిన ప్రణబ్ స్థానంలో రాహూల్కు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. తరువాత ఏమైందో ఏమో కానీ, రాహూల్ ‘కీ’లక బాధ్యతల చర్చ సద్దుమణిగింది. తాజాగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ రాహూల్ వస్తానంటే ప్రభుత్వంలోకి ఆహ్వానించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాహూంల్ ఎలాంటి బాధ్యతలు అప్పగించిన పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనడం...దానికి ప్రధానమంత్రి వెల్ కమ్ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా ప్రధాని నోటి వెంట వచ్చిన మాటలతో కేంద్రంలో రాహూల్కు ఏమైనా ‘పెద్ద’ బాధ్యతలు అప్పగించడానికి కసరత్తులు జరుగుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. రాహూల్కు ఇస్తారనీ ప్రచారం జరిగిన ఆర్థిక శాఖను చిదంబారానికి కేటాయించారు. లోక్ సభలో ఏమైనా సభా నాయకుడిని చేస్తారా? అంటే అది కూడా కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అప్పగించారు. ఇవీ కాకుండా, రాహూల్కు మరే పదవీ అప్పగిస్తారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కూడా ఇప్పట్లో లేదనీ ప్రధానమంత్రే చెప్పారు. అయితే, ‘రాజు తలచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్లుగా’ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్మన్ హెదాలో సోనియాగాంధీ అనుకుంటే రాహూల్ ఏ క్షణ్నయినా ఎలాంటి పదవీలోనైనా కూర్చోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: