తెలంగాణలో విజయమ్మ

హైదరాబాద్: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల శుక్రవారం నాడు తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా తల్లీకూతుర్లు ఇద్దరూ పరకాల నియోజక వర్గంలోని గీసుకొండ, పరకాలలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పి పరకాలకు రావల్సిందిగా అటు తెలంగాణ వాదులు, ఇటు తెరాస ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరకాలలో కొంత వరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి తగ్గట్టుగానే వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అన్ని ఏర్పాట్లను చేసుకుంది. గీసుకొండలో రోడ్ షోతో పాటు, పరకాలలో విజయమ్మ, షర్మిలతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా పరకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిన రోడ్ షో, బహిరంగ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: