‘శ్రీవారి’ సన్నిధిలో చీడపురుగులు

murali
పవిత్ర కొండల్లో కొలువైన తిరుమలేషుడికే భద్రత కరువైంది. అందరి మొక్కులు తీర్చే ఆపద మొక్కుల వాడికే ఆపద వచ్చింది. ప్రపంచ నలుమూల నుండి ప్రతిరోజు లక్షలాదిగా ఏడుకొండల ఎంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులను దగ్గరి వాళ్ళే దూరం చేస్తున్నారు. ముక్కోటి దేవతలకు నిలయమైన తిరుమలలో భద్రతకు భంగం వాటిల్లుతోంది.       నిత్యం గోవిందనామ స్మరణతో మార్మోగే తిరుమల దేవుడి సన్నిధిలో సేవకులే యముళ్లుగా మారారు. అన్యమత ప్రచారకులుగా మారి నమ్ముకున్న వారినే ‘శ్రీవారి’ పై శఠగోపం పెట్టమంటున్నారు. ఏళ్లపాటు ఏడుకొండల వాడి సన్నిధిలో జీవనాధారం పొందుతూ... పనిచేస్తున్న ‘దేవుడి’ సన్నిధిలోనే అన్యమత ప్రచారానికి ఒడిగడుతున్న ముగ్గురు చీడ పురుగులను విజిలెన్స్ టీం అదుపులోకి తీసుకొని విధుల్లోని నుంచి బహిష్కరించారు.     ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియగానే యావత్ హిందూ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మరో ఘోరమైన విషయం ఏమిటంటే దర్యాప్తు అధికారులకు ‘యముళ్ల’ ఇళ్లల్లోనూ సోదాలు జరిపితే ఇతర మతాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు దర్శనమివ్వడం మరింత దౌర్భాగ్యం. ఈ అన్యమత విద్రోహులు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ప్రచారం చేసి దొరికితే ధనం పై వ్యామోహమో లేక ఇతర మతస్తుల ఒత్తిడితోనే అలా చేసి ఉండవచ్చని అనుకోవచ్చు.  ప్రతిరోజు తెల్లవారుఝాము నుండే తిరుమలేశుని పాదాల చెంతనే ఉంటూ... ఇతర మతాలకు వత్తాసు పలుకుతూ... తోటి ఉద్యోగులను సైతం అన్యమతం స్వీకరించమని కోరడం నీచానీచం. తిన్నింటికే కన్నం వేసే ఇలాంటి ఇంటి దొంగలు ఉన్నంత కాలం మనుషులకేమో గాని దేవుళ్లకే రక్షణ ఉండదంటే ఉండదు. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ నమ్మక ద్రోహులను కేవలం ఉద్యోగం నుండే కాకుండా పవిత్ర తిరుపతి నుండే బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇతర అన్యమతస్తులకు ఓ గుణపాఠం కావాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: