హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనయుడైన రాహూల్ గాంధీ కేంద్రంలో ఇక కీలకం కానున్నారు. కేంద్ర మంత్రిగా త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశం వుంది. ఈమేరకు రాహూలే స్వయంగా కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తాననీ ప్రకటించారు. రాహూల్ కేంద్రంలో కీలకపాత్ర పోషించే విషయాన్ని ఆయనకు వదిలి వేసినట్లు రాహూల్ తల్లి అయిన సోనియా ప్రకటించిన 24గంటల వ్యవధిలోనే రాహూల్ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వంలో తనకెలాంటి బాధ్యతలను అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహూల్ పేర్కొనడంతో ఆయనను కేంద్ర కేబినెట్ లోకి రావడం ఖాయంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి వర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా రాహూల్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం వుంది. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ర్టపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విధితమే. దీనితో ఆర్థిక మంత్రి పదవీకి ప్రణబ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ శాఖకు మంత్రి ఎవరూ లేరు. ఈ శాఖను రాహూల్ గాంధీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ర్టపతి ఎన్నికల తరువాత ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమవుతాయనీ తెలుస్తోంది. గత కొంత కాలంగా రాహూల్ గాంధీని కేంద్ర కేబినెట్ లోకి తీసుకువచ్చేందుకు భారీగానే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఇప్ప్పుడే తనకు ఎలాంటి పదవులు వద్దనీ, ముందు పార్టీ పటిష్టతపై ద్రుష్టి పెట్టారు. కానీ, పార్టీలోని చాలా మంది నాయకులు ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు రాహూల్ గాంధీ కేంద్ర కేబినెట్ లోకి రావాలనీ ఒత్తిళ్లు తెచ్చారు. ఎంతో మంది ఇదే ప్రయత్నం చేసినా, తనకు ఇప్పుడు ఆ వయసు రాలేదంటూ రాహూల్ చెబుతూ వచ్చారు.
సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే మిగిలింది. కేంద్రంలో క్రీయాశీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పదవీ ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ రాహూల్ గాంధీ కేంద్ర మంత్రి పదవీ అంశం తెరమీదకు వచ్చింది. ఇదే విషయమై సోనియాగాంధీ మాట్లాడుతూ రాహూల్ కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే విషయాన్ని ఆయనే తీసుకుంటారనీ చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే రాహూల్ తనకెలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, అయితే, తనకు అప్పగించే పదవీ విషయంలో ప్రధాని, పార్టీ అధ్యక్షురాలు నిర్ణయం తీసుకోవల్సి వుందన్నారు. మొత్తానికి రాహూల్ గాంధీ మంత్రి పదవీ తీసుకునే సమయం ఆసన్నమైందనీ చెప్పొచ్చు. కేంద్రంలో ఎంతో కీలకమైన ఆర్థిక మంత్రి పదవీని రాహూల్కు అప్పగించే అవకాశం వుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: