ఇదేం పద్దతి “గౌరవం” పోతుంది

Kuthuru RajiReddy
సకలజనుల సమ్మె సందర్భంగా తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు ఆవరణలో పాల్పడిన భీభత్సంపై రాష్ట్రప్రభుత్వం చూసిచూడనట్లు వ్వవహరించడంతోనే సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సమస్య ఏదైనప్పటికిని హైకోర్టు ఆవరణలోకి వచ్చి గొడవలకు పాల్పడడంపై న్యాయవాదులపై ఉన్నటువంటి గౌరవం పోయే అవకాశముంది. న్యాయవాదిగా ఉండి కోర్టు ఆవరణలో భీభత్సం సృష్టించడం సహజంగానే తప్పుగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయవాదులే అంగికరిస్తున్న సందర్భంలో సకలజనుల సమ్మెసందర్భంగా కోర్టులో ఉండే వారందరు భయపడే విధంగా న్యాయవాదులు వ్యవహరించడం సమంజసంగా లేదనిపిస్తుంది. కోర్టు పనిదినాల్లో ఏదో ఒక కేసుపై వాధనలు, తీర్పులు వెలువడుతుంటాయి అటువంటి సందర్భంలో పనులకు ఆటంకం కల్పించడం ఎంతవరకు న్యాయమనిపిస్తుందనే విషయంపై ఆలోచించాలి. అడ్వకేట్ ఆక్ట్, బార్ కౌన్సిల్స్ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడడం నేరమే అవుతున్నప్పటికిని చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగువేయకపోవడంతోనే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోనే న్యాయమూర్తులు, న్యాయవాదులు భయాంధోళనకు గురయ్యే విధంగా కొంత మంది న్యాయవాదులు వ్యవహరించడంను తప్పుపట్టాల్సిందే?. రాష్ట్రవిభజన కోసం జరిగిన సకలుజనుల సమ్మె కారణంగా జరిగిన సంఘటనలపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందేమోనని ఆలోచన చేసిందా లేదా కారణమేదైనా కావచ్చుగాని ఇటువంటి చర్యలు జరుగడం భాధకరం. ఇంతే కాదు ఇటువంటి చర్యలు ఇదే విధంగా జరిగితే దేశంలోని అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టులో సైతం ఇటువంటి సంఘటనలు జరుగవచ్చు. ఇటువంటి సమయంలో న్యాయవ్యవస్థపై ప్రజలకున్నటువంటి గౌరవం తగ్గే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: