బిచాన ఎత్తివేసిన మరో సంస్థ: రూ.100కోట్లకు కుచ్చుటోపి

 హైదరాబాద్: సిటీలో మరో ఆన్ లైన్ ట్రేడింగ్ సంస్థ బిచాన ఎత్తివేసింది. ఖాతాదారులకు సుమారుగా 100కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రమేష్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ నేత్రుత్వంలో నగరంతో పాటు గుంటూరు, విజయవాడ పట్టణాలలో సిటీ ఆన్ లైన్ ట్రేడింగ్ అనే ఓ సంస్థను ప్రారంభించారు. 10వేల రూపాయలు డిపాజిట్ చేస్తే ఆరు నెలలు తిరిగేలోపు 20వేల రూపాయలు ఇస్తామంటూ జోరుగా ప్రచారం చేశారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. తొలుత పలువురు ఖాతాదారులకు డబ్బులు చెల్లించడంతో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు, నిరుద్యోగులు ఈ సంస్థ వైపు మొగ్గు చూపారు. అయితే, గత ఐదారు రోజులుగా సిటీలోని ఆన్ లైన్ ట్రేడింగ్ కార్యాలయాన్ని తెరువడం లేదు. దీనిపై అనుమానం వచ్చిన ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో సదరు ఆన్ లైన్ ట్రేడింగ్ సంస్థ బిచాన ఎత్తివేసిందని తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని కేసును సీసీఎస్ పోలీసులకు బదలీ చేశారు. ఆన్ లైన్ సంస్థ అధినేత రమేశ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. మొత్తానికి బాధితులు మాత్రం లబోదిబోమని మొత్తుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: