రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వం

Priyanka Reddy
రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. నగదు బదిలీ పేరుతో పేదలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే కేంద్రం లోని మన్మోహన్ ప్రభుత్వం, రాష్ట్రంలోని కిరణ్ సర్కార్ పన్నుల భారం, ధరల పెంపుతో నడ్డివిరుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకుంటామని... రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు నుంచి చంద్రబాబు రెండో రోజు పాదయాత్రను ప్రారంభించారు. దారి వెంట పొలంలోకి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను బాబుకు వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: