అమరావతి : జనసేనను నెటిజన్ల ఫుట్ బాల్

Vijaya



జనసేన పార్టీ పిచ్చ కామిడీని పండిస్తోంది. పార్టీపెట్టి 10 ఏళ్ళవుతున్నా ఇంతవరకు 175 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు లేరు. తెలంగాణాలో పార్టీకి దిక్కు దివాణం లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నా ఇంతవరకు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తారో చెప్పలేదు. ఒంటరిపోటీనా లేకపోతే పొత్తులు పెట్టుకుంటారా అనే విషయంలో క్లారిటిలేదు. మిగిలిన పార్టీలు నియోజకవర్గాల ఇన్చార్జిలను, అభ్యర్ధులను ఫైనల్ చేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే.



ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుమతితో ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆస్ట్రేలియాలో సమన్వయకర్తలను నియమించారు. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాల్లో  సుమారు 40 మందిని సమన్వయకర్తలుగా నియమించినట్లు నాగబాబు ప్రకటించారు. న్యూసౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్ ల్యాండ్, వెస్టర్స్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరీలో పార్టీ పటిష్టానికి సమన్వకర్తలను నియమించారు. ఇక్కడే నెటిజన్లు జనసేనను, పవన్ ను ఓ రేంజిలో ఆడుకుంటున్నారు.



ఏపీలో దిక్కులేని పార్టీకి ఆస్ట్రేలియాలో సమన్వయకర్తలా అంటు ఎద్దేవాచేశారు. రష్యాలో సమన్వయకర్తలను ఎందుకు మరచిపోయారంటు ఎగతాళిగా కామెంట్లుచేస్తున్నారు. ఏపీలోనే దిక్కులేని పార్టీకి ఆస్ట్రేలియాలో సమన్వయకర్తలు ఎందుకంటు నిలదీస్తున్నారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు తమదైన స్టైల్లో జనసేన, పవన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.  కొందరైతే చాలా ఘాటుగాను మరికొందరైతే కాస్త  నాటుగాను కామెంట్ చేస్తున్నారు. సరే ఎవరెలా కామెంట్లు చేసినా, ఎద్దేవాచేసినా భావం ఏమిటంటే ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయంపై ముందు దృష్టిపెట్టమని.



నెటిజన్లు అన్నారని కాదుకానీ పవన్ వ్యవహారం చాలా సిల్లీగా ఉంది. 175 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అభ్యర్ధులు లేరు. పోనీ ఇన్చిర్జీలు ఉన్నారా అంటే అదీలేదు. టీడీపీతో పొత్తుపెట్టుకోవాలని పవన్ అనుకోవటం బాగానే ఉంది. పోనీ పొత్తులో ఎన్నిసీట్లు తీసుకోవాలని అనుకుంటున్నారో బహిరంగంగా చెప్పలేదు. తీసుకోబోయే సీట్లేమిటో తెలీదు. పొత్తుల్లో సీట్ల సర్దబాటు అంత వీజీకాదు. సీట్ల సర్దుబాటు వీళ్ళు చేసుకున్నా ఓట్ల బదలాయింపు అనుమానమే. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ముందునుండే ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ పవన్ దగ్గర ఉన్నట్లు లేదు. అందుకనే నెటిజన్లు ఆస్ట్రేలియా సమన్వయకర్తల నియామకంపై జోకులేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: