అమరావతి : చంద్రబాబుకు ఢిల్లీలో సీన్ రివర్సయ్యిందా ?

Vijayaచంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో ఎల్లోమీడియా వైఖరి చాలా అనుమానాస్పదంగా తయారైంది. మామూలుగానే అక్కడ ఏమీలేకపోయినా అదిగో పులి ఇదిగో తోక అన్నట్లుగా చంద్రబాబు విషయంలో ఎల్లోమీడియా నానా రచ్చ చేసేస్తుంది. ఏదో పుట్టినరోజు శుబాకాంక్షలు చెప్పటానికో లేదా ఇంకేదైనా సందర్భంలో చంద్రబాబుకు ఫోన్ చేసినా చాలు దాన్ని కొండంతంగా ప్రచారం చేసేస్తుంది ఎల్లోమీడియా. అలాంటిది ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన తర్వాత కూడా ఆ విషయాన్ని ఎల్లోమీడియా ఎక్కడా ప్రముఖంగా ప్రచారం చేయలేదంటేనే ఏదో తేడా కొట్టిందని అనుమానంగా ఉంది.అమిత్-చంద్రబాబు మధ్య దాదాపు 50 నిముషాలు భేటీ జరిగిందంటున్నారు. ఎప్పటినుండో బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2018 తర్వాత నరేంద్రమోడీ, అమిత్ షా ను కలవాలని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళు అపాయిట్మెంట్ ఇవ్వటంలేదు. అలాంటిది సడెన్ గా చంద్రబాబుకు అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చారంటేనే ఎక్కడో అనుమానం మొదలైంది. తీరాచూస్తే చంద్రబాబును రమ్మని అమిత్ కోరలేదట.ఇదే సమయంలో తనకు అపాయిట్మెంట్ ఇవ్వమని చంద్రబాబు కూడా షా ను అడగలేదట. అయినా ఇద్దరి మధ్య భేటీ ఎలా జరిగింది ? ఎలాగంటే చంద్రబాబును నడిపిస్తున్న ‘డ్రైవింగ్ ఫోర్స్’ తనవసరాల కోసం అమిత్ తో మాట్లాడుకుని అపాయిట్మెంట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు బదులుగా చంద్రబాబు వస్తారని చెప్పి అమిత్ దగ్గరకు రాయబారం  పంపారట.అయితే చంద్రబాబు ఒకందుకు వెళితే అక్కడ మరోటి జరిగిందని ప్రచారం జరుగుతోంది. దాంతో తాను ఊహించనిది జరగటంతో చంద్రబాబు షాక్ కు గురై తిరిగి వచ్చేశారట. అందుకనే ఢిల్లీ టూర్ పై ఎల్లోమీడియాలో పెద్దగా వార్తలు కనబడలేదు. అప్పటికీ తెలంగాణాలో బీజేపీకి గెలుపుకు సహకరించమని చంద్రబాబును అమిత్ షా అడిగారని రాసుకున్నదంతే. అంతుకుమించి విశేషాలు ఏమీ రాయలేదు. దీంతోనే అర్ధమైపోతోంది చంద్రబాబు ఢిల్లీ టూర్ పూర్తిగా రావర్స్ కొట్టిందని. అందుకనే ఎల్లోమీడియా పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: