కొత్త పార్లమెంటు భవనం ప్రారంభంపై స్పందించిన జగన్?

Purushottham Vinay
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలనే 20 విపక్షాల నిర్ణయాన్ని వైసీపీ అధ్యక్షుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు.కొత్త  పార్లమెంటు భవనం ప్రారంభంపై ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్ చేశారు. ఈ రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ ఖచ్చితంగా హాజరవుతుందని ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఇక కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని మోదీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.


'పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య గుడి. ఈ గుడి మన దేశం  ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది కేవలం మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా చెందినది. అయితే ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం మాత్రం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. ఈ రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరుకావాలని కోరుతున్నాను. ఒక నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది'' అని ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
ఇక కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై గొడవ కొనసాగుతోంది. ఈ మే నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ప్రధాన మంత్రి కాకుండా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తునట్టు మొత్తం 19 పార్టీలు లేఖను విడుదల చేశాయి. కొత్త పార్లమెంట్‌ను స్పీకర్‌ ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు మజ్లిస్‌ అధ్యక్షుడు ఒవైసీ. అలాగే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని విపక్షాలు నిర్ణయించడం మంచి పరిణామమన్నారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: