అమరావతి : అవినాష్ ను వెంటాడుతున్న కారణం ఇదేనా ?

Vijayaకొద్దిరోజులుగా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎల్లోమీడియా అవినాష్ రెడ్డిని వెంటాడుతోంది. సీబీఐ, కోర్టులో వివేకామర్డర్ కేసు విచారణ జరిగి తీర్పురాకపోయినా ఎల్లోమీడియా మాత్రం కడప ఎంపీ అవినాష్ ను దోషిగా తేల్చేసింది. అవకాశం ఉండుంటే ఓ 60 ఏళ్ళు జైలుశిక్ష కూడా వేసేసుండేదే అనటంలో సందేహంలేదు.  అవినాష్ విషయంలో ఎల్లోమీడియా ఎందుకింత కసిగా వ్యవహరిస్తోంది ? ఎందుకింత పైశాచికత్వంతో వెంటాడుతోంది ?ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే కారణం. జగన్ను ఏమీచేయలేకపోతున్న టీడీపీతో కలిసి ఎల్లోమీడియా దొరికిన అవినాష్ మీద తమ కసినంతా తీర్చుకుంటున్నది. 2019లో టీడీపీని చావుదెబ్బ కొట్టిన జగన్ అంటే చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలిచేది అనుమానంగానే ఉన్నట్లుంది. 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అవుతారనే ఊహను కూడా వీళ్ళు భరించలేకపోతున్నారు. రాజకీయ జీవితం క్లైమ్యాక్స్ ఇంతటి అవమానకరమైనరీతిలో ముగుస్తుందనే ఆలోచనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు లేకపోతే ఎల్లోమీడియాకు దిక్కేలేదు. చంద్రబాబు, ఎల్లోమీడియా యాజమాన్యాలు కవలపిల్లలాంటివాళ్ళు. వీళ్ళందరికీ 2024 ఎన్నికలే డెడ్ లైన్. 2024లో కూడా టీడీపీ ఓడిపోతే వీళ్ళ భవిష్యత్తు గోవిందానే. అందుకనే జగన్ పై వీలైనంతగా బురదచల్లేసి జనాల్లో వైసీపీని నెటిగివ్ గా చూపించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నది.  అయితే వీళ్ళెంత ప్రయత్నిస్తే జగన్ అంతగా రెచ్చిపోతున్నారు. దాంతో వీళ్ళకి ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు.ఈ నేపధ్యంలోనే వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఆయుధంలాగ దొరికింది. ఇందులో అవినాష్ పాత్రుందని సీబీఐ విచారణకు రమ్మని పిలవటాన్ని ఎల్లోమీడియా అడ్వాంటేజ్ తీసుకుని విపరీతంగా బురదచల్లేస్తోంది. ఇదే సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ మోసం విచారణలో రామోజీరావును సీఐడీ పిండేస్తోంది. రేపు జూన్ 10వ తేదీన మార్గదర్శి చందాదారుల జాబితాను సుప్రింకోర్టుకు రామోజీ అందించాలి. జాబితా అందిస్తే మొత్తం లొసుగులన్నీ బయటపడతాయి. ఇదే సమయంలో అమరావతి భూ కుంభకోణం, కరకట్ట అక్రమ నిర్మాణం కేసులు చంద్రబాబు మెడకు చుట్టుకోబోతున్నాయి. అందుకనే చంద్రబాబు, ఎల్లోమీడియా జగన్ను ఏమి చేయలేక తనపైన పెరిగిపోతున్న  కసిని అవినాష్ మీద చూపిస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: