అమరావతి : ముదురుతున్న అవినాష్-సీబీఐ వివాదం

Vijaya


కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐకి మధ్య వివాదం రోజరోజుకు ముదిరిపోతోంది. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీని విచారించాలని అవసరమైతే అరెస్టు చేయాలని సీబీఐ తెగ ప్రయత్నిస్తోంది. విచారణ వరకు ఓకేనే కానీ అరెస్టు నుండి తప్పించుకోవాలని అవినాష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులో కేసులువేసినా ఊరట దక్కలేదు. ఇప్పటివరకు పలానా రోజున ఎంపీని అరెస్టుచేస్తామని సీబీఐ ఎక్కడా ప్రకటించలేదు. అయితే విచారణపేరుతో పిలిపించి సీబీఐ తనను అరెస్టుచేస్తుందేమో అనే టెన్షన్ ఎంపీలో పెరిగిపోతోంది.ఈ నేపధ్యంలోనే అవినాష్-సీబీఐ మధ్య వ్యవహారం టీవీల్లో ప్రసారమయ్యే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో అయిపోయింది. పట్టుకోవటానికి సీబీఐ ప్రయత్నిస్తుంటే అరెస్టును తప్పించుకునేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా సోమవారం విచారణకు రావాలని సీబీఐ ఎంపీకి నోటీసులిచ్చింది. నిజానికి శుక్రవారమే విచారణకు హాజరుకావాల్సుంది. అయితే తన తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారుకాబట్టి విచారణకు హాజరుకాలేనని అవినాష్ చెప్పారు. సీబీఐ అనుమతితో సంబంధంలేకుండానే ఎంపీ పులివెందులకు వెళ్ళిపోయారు.ఇక్కడ సమస్య ఏమిటంటే ఎంపీని అరెస్టుచేయాలని సీబీఐకి ఉందో లేదో తెలీదు కానీ ఎల్లోమీడియాకు మాత్రం విపరీతంగా ఉంది. ఎలాగైనా సరే అవినాష్ ను సీబీఐతో అరెస్టుచేయించేందుకు ఎల్లోమీడియా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకనే అరెస్టు అరెస్టంటు ప్రతిరోజు బ్యానర్ కథనాలు అచ్చేస్తోంది. సీబీఐ విచారణతో పాటు  అరెస్టు నుండి తప్పించుకునేందుకు అవినాష్ డ్రామాలు ఆడుతున్నాడంటు ఎల్లోమీడియా నానా రచ్చచేస్తోంది.దర్యాప్తు సంస్ధల విచారణను, అరెస్టును తప్పించుకునేందుకే ఎవరైనా ప్రయత్నిస్తారు. ఇన్ని సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు చేస్తున్నదిదే కదా. ఎప్పటి ఆరోపణలనో పక్కనపెట్టినా ఓటుకునోటు కేసులో ఏసీబీ విచారించాలని చంద్రబాబుకు నోటీసు ఇవ్వగానే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. సీబీఐ విచారణకు అవినాష్ ఇప్పటికే ఆరుసార్లు హాజరయ్యారు. చంద్రబాబు అయితే తనను విచారించే అర్హతే ఏసీబీకి లేదని స్టే తెచ్చుకున్నారు. అమరావతి భూకుంభకోణంలో విచారణంటే స్టే తెచ్చేసుకున్నారు. చంద్రబాబుతో పోల్చుకుంటే అవినాష్ చాలా నయమనే చెప్పాలి. సీబీఐ విచారణకే కాదు కోర్టు విచారణకు కూడా హాజరై తన వాదన వినిపిస్తున్నారు. సోమవారం విచారణకు అవినాష్ హజరవుతారా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: