ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఆ చోట్ల పిడుగులు పడే ఛాన్స్?

Purushottham Vinay
ఇక నైరుతి రుతుపవనాలు రాగల 2-3 రోజులలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ఇంకా అలాగే అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులనేవి అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు దాకా ఉన్న ద్రోణి ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు దాకా మరఠ్వాడా, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉండి కొనసాగుతున్నది. ఇక పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ దాకా ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి ఇపుడు బలహీన పడినది. ఆంధ్ర ప్రదేశ్ ఇంకా యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ ఇంకా నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆదివారం, సోమవారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఇక ఈదురు గాలులు అనేవి గంటకు30 - 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.మంగళవారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.


అయితే గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం, సోమవారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఇక ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అలాగే ఈదురు గాలులనేవి గంటకు 30 - 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.అలాగే మంగళవారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.రాయలసీమలో ఆదివారం, సోమవారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 4° C దాకా ఎక్కువుగా నమోదు కావచ్చును. ఇంకా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఇక ఈదురు గాలులు గంటకు 30 - 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.అలాగే మంగళవారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: