అమరావతి : రామోజీ-చంద్రబాబు ఇద్దరిదీ ఒకటే సమస్యా ?

Vijaya



ఇద్దరు ఇద్దరే చాలా విచిత్రమైన వ్యక్తులు. ప్రపంచానికి నీటిపాఠాలు బోధిస్తుంటారు. కానీ తాము మాత్రం ఆ నీతులను పాటించరు. తాము ఎన్ని అక్రమాలు చేసినా సరే, నిబంధనలను  ఉల్లంఘించినా సరే ఎవరు అడగకూడదు. ఎవరైనా అడిగితే వెంటనే మీడియాపై దాడని ఒకళ్ళు, కక్షసాధింపులు, వేధింపులని ఇంకోళ్ళు గోలగోల చేసేస్తారు. ఈపాటికే అర్ధమైపోయుంటుంది  ఆ ఇద్దరు రామోజీరావు, చంద్రబాబునాయుడు అని. తాజాగా కరకట్టమీద చంద్రబాబు నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం జప్తు చేయగానే వేధింపులు, కక్షసాధింపులంటు టీడీపీ గోల మొదలుపెట్టేసింది.



అక్రమ నిర్మాణంలో చంద్రబాబు ఉండచ్చా అని అడిగితే మాత్రం సమాధానం చెప్పరు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సదరు నిర్మాణం ప్రభుత్వానిదని చంద్రబాబే చెప్పారు. ప్రతిపక్షంలోకి రాగానే ఆ భవనం లింగమనేని రమేష్ ద ని చెప్పారు. రెండింటింలో ఏది కరెక్టని అడిగితే మాట్లాడరు. ఇంతకీ సదరు భవనం లింగమనేనిదా ? చంద్రబాబుదా చెప్పమంటే చెప్పరు. లింగమనేని భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసినట్లుగా రికార్డులు లేవు. పోనీ చంద్రబాబు అద్దెకు ఉంటున్నట్లు రెంటల్ అగ్రిమెంట్ ఉందా అంటే అదీలేదు.



ప్రభుత్వ భవనంలో ఉండటానికి చంద్రబాబు అనుమతి తీసుకున్నారా అంటే తీసుకోలేదు. భవనం లింగమనేనిదే అయితే ఆయనకు చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారా అంటే చెప్పరు. ముఖ్యమంత్రిగా దిగిపోయి నాలుగేళ్ళయినా ప్రభుత్వ భవనంలో అక్రమంగా ఎలాగ ఉంటారని అడిగితే సమాధానం చెప్పరు. అంటే చంద్రబాబు వైఖరి చూస్తుంటే తనను ఎవరు అడుగుతారు, తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రాదులే అన్నట్లుగా ఉంది. అందుకనే లింగమనేని భవనం విషయంలో అడ్డుగోలుగా  వ్యవహరించారు.



సరిగ్గా రామోజీరావు వైఖరి కూడా ఇలాగే ఉంటుంది. హెచ్యూఎఫ్ పద్దతిలో మార్గదర్శి  చిట్ ఫండ్స్ సంస్ధ బయటనుండి నిధులు తీసుకొచ్చి నడపకూడదు కదా అని సీఐడీ  అడిగితే  కంపెనీ లా చట్టం ప్రకారం నడుపుతున్నట్లు చెప్పారు. కంపెనీ లా చట్టం ప్రకారం చిట్ ఫండ్స్ సంస్ధను నడపకూడదు కదా అని అడిగితే తనపైన ఇంతవరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని అడ్డుగోలుగా మాట్లాడుతారు. అంటే మార్గదర్శ చిట్ ఫండ్స్ సంస్ధను నడపటంలో రామోజీ గడచిన 60 ఏళ్ళుగా నిబంధనలను అడ్డుగోలుగా అతిక్రమించారని అర్ధమైపోయింది.



కోర్టులో ఒకసారి ఒక అఫిడవిట్ దాఖలు చేస్తారు. మరోసారి ఇంకో అఫిడవిట్ ను దాఖలుచేస్తారు. ఒకసారేమో మార్గదర్శికి తనకు సంబంధంలేంటారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్లో  ఛైర్మన్ గా మళ్ళీ రామోజీనే సంతకంచేస్తారు. వీళ్ళిద్దరు చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతనుండదు. వీళ్ళకి ఎంతకాలం ఇలా సాగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: