బెంగుళూరు: డీకేకి ఇదే అతిపెద్ద మైనస్ ?

Vijaya



ఎవరు ఎన్నిసార్లు అభిప్రాయ సేకరణలు చేసినా, ఎంతమంది పరిశీలకులు వచ్చినా ఎలాంటి ఉపయోగముండదు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పాత్ర చాలా ఎక్కువుందని అంగీకరించాల్సిందే. అయితే అంతమాత్రాన డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయటం కుదరదు. పార్టీ విజయంలో తాను పడిన కష్టానికి ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిందే అని డీకే గట్టిగా పట్టుబడుతున్నారు.



మామూలుగా అయితే డీకే డిమాండ్ చాలా జెనూయిన్ అనేచెప్పాలి. కానీ ఇక్కడ డీకేకి అతిపెద్ద మైనస్ ఒకటుంది. అదేమిటంటే ఆక్రమ ఆదాయార్జన కేసులు. డీకే మీద సీబీఐ, ఈడీలు ఇఫ్పటికి 19 కేసులు నమోదుచేసున్నాయి. ఒక కేసులో అరెస్టయి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. అవినీతికేసుల్లో అరెస్టయి బెయిల్ మీద తిరుగుతున్న డీకేకి సీఎం పదవి ఇవ్వటం ఎంతమాత్రం మంచిదికాదు. ఎందుకంటే రేపు డీకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మళ్ళీ దర్యాప్తు సంస్ధలు అరెస్టంటే అప్పుడు పరిస్ధితి ఏమిటి .



కొత్తగా అరెస్టుచేయకపోయినా ఇపుడున్న బెయిల్ ను కోర్టు రద్దుచేసినా మళ్ళీ జెయిల్ కు వెళ్ళాల్సిందే కదా. ఒక ముఖ్యమంత్రి జెయిల్ కు వెళ్ళాల్సి రావటం కాంగ్రెస్ కు ఏమంత గౌరవం ? ఇదే విషయాలను డీకేతో అధిష్టానం తరపున కీలకనేతలు నచ్చచెబుతున్నారు. అయితే అందుకు డీకే ఏమాత్రం అంగీకరించటంలేదు.



సీఎం పదవి తనకు ఇవ్వకపోతే క్యాబినెట్లో కూడా స్ధానం అవసరంలేదని మంకుపట్టుపడుతున్నారు. డీకే గనుక ముఖ్యమంత్రి పదవి తీసుకుని వెంటనే మళ్ళీ జైలుకు వెళ్ళాల్సొస్తే పోయేది పార్టీ పరువే అన్న విషయాన్ని ఆలోచించటంలేదు. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు డీకేపైన కేసుల కత్తి వేలాడుతునే ఉంటుంది. కేసుల నుండి డీకే ఎంతొందరగా బయటపడటం పార్టీతో పాటు డీకే కూడా అంతమంచిది. ఇంతచిన్న విషయాన్ని డీకే ఆలోచించకుండా మొండిపట్టు పట్టడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభము ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: