గోదావరి : పవన్ ఎప్పుడూ ఇంతేనా ?

Vijaya


జనసేన చీఫ్ పవన్ కల్యాన్ విషయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అయితే తొందరపడి ముందే ఏదో ఒకటి మాట్లాడేస్తారు. లేకపోతే అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా గోలగోల చేస్తారు. ఇంతకీ ఇపుడు విషయం ఏమిటంటే అకాల వర్షాలకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోయారు. వేలాది ఎకరాల్లోని పంటలంతా పొలాల్లోనే నీటి ముణిగిపోయాయి. వర్షాలు పడుతుండగానే పర్యటనల పేరుతో  చంద్రబాబునాయుడు గోలగోల మొదలుపెట్టేశారు.



రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పండిన, రంగుమారిన ప్రతి ధాన్యగింజను ప్రభుత్వం కొనాల్సిందే అంటు డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పంటలను కొనటానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నా చంద్రబాబు మాత్రం ఫుల్లుగా డ్రామాలాడేశారు. ఈ నేపధ్యంలోనే బుధవారం పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని కడియం ప్రాంతంలో పర్యటించారు. తన పర్యటనలో రైతులకు నష్టంవస్తే ప్రభుత్వం ఎక్కడుందో తెలీదని, పంటలు నష్టపోతే అధికారులు తొంగికూడా చూడలేదని చాలా గోలచేశారు.



అయితే పవన్ కు తెలీని విషయం ఏమిటంటే ఆల్రెడీ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించేసింది. పంటలు దెబ్బతిన్న ఐదురోజులకే రైతులకు నష్టపరిహారం అందటం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదట. బుధవారం ఒక్కరోజే 32,558 మంది రైతులకు రు. 474 కోట్ల జమయ్యాయి. అలాగే రబీ సీజన్లో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రు. 1277 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.



మామూలుగా ఎప్పుడైనా జరిగేదేమిటంటే వర్షాలు, తుపానులున్నపుడు ఎవరూ పంటల నష్టాలను అంచనాలు వేయటానికి రారు. వర్షాలు, తుపాన్లు ఆగిపోయిన తర్వాత అధికారులు క్షేత్రస్ధాయి పర్యటనలు చేసి నష్టాలను అంచనాలు వేస్తారు. ఏ ప్రభుత్వంలో అయినా జరిగేదిదే. కాకపోతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకని చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేసేశారు. చంద్రబాబుదే ఓవర్ యాక్షన్ అంటే పవన్ ది మరీ ఓవర్ గా ఉంది. పర్యటనల్లో వీళ్ళిద్దరు నానా రచ్చచేస్తే జగన్ మాత్రం సైలెంటుగా తన పనికానిచ్చేశారు.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: