అమరావతి : తమ్ముళ్ళలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ ?

Vijayaకారణాలు సరిగా తెలియటంలేదుకానీ తమ్ముళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిందే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా చంద్రబాబునాయుడు దగ్గరనుండి కిందస్ధాయి తమ్ముళ్ళవరకు ఒకటే ఆరోపణ. గూగుల్ లో 6093 అని కొడితే జగన్ నేరచరిత్రంతా కనబడుతుందని తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ, కాలువ, నిమ్మల మండిపడ్డారు.  జగన్ పదితలల రావణాసురుడని, వివేకానందరెడ్డిని  హత్యచేయించాడని ఇలా రకరకాలుగా ఆరోపణలు గుప్పించారు.నిజానికి ఇవి కొత్తదేమీ కాదు. చాలాకాలంగా ఇలాంటి ఆరోపణలను చంద్రబాబు ఎంతోమందితో చేయించారు. వీళ్ళెంత ప్రచారంచేసినా 2014లో 67 సీట్లిచ్చిన జనాలు 2019లో వైసీపీకి అఖండ మెజారిటి అందించిన విషయం అందరికీ తెలిసిందే. అధినేత్రి సోనియాగాంధీని థిక్కరించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాతే జగన్ పై కేసులు నమోదైందని, సీబీఐ జైలుకు పంపిందన్న విషయం జనాలందరికీ తెలిసిందే. ఇందులో కొత్తేమీలేదు. అయితే అదే విషయాన్ని సోమిరెడ్డి లాంటివాళ్ళు పదేపదే ప్రస్తావిస్తున్నారంటేనే వీళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ ఎంతగా పెరిగిపోయిందో అర్ధమవుతోంది. అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనబడటంలేదు. చంద్రబాబు సభలకు జన స్పందన ఉండటంలేదు. ఒకవైపు పొత్తుల అయోమయం.వీళ్ళు చూడాల్సిందే 6093 నెంబర్ చరిత్ర కాదు 2024లో తమ భవిష్యత్తు ఎలాగుంటుందనే. 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకే పార్టీ దాదాపు కుదేలైపోయింది. అప్పటినుండి జగన్ను చంద్రబాబు నోటికొచ్చినట్లు తిడుతుండటమే కాకుండా ఎల్లోమీడియాతో ప్రతిరోజు బురదచల్లిస్తునే ఉన్నారు. జగన్ పై బురదచల్లించటంలో చూపిస్తున్న శ్రద్ధలో సగం పార్టీ మీద చూపించినా బలోపేతమయ్యేదే. రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ దాదాపు కనుమరుగు అయిపోయినట్లే.వయసు అయిపోతోంది కాబట్టి చంద్రబాబుకు జరిగే నష్టాన్ని పక్కనపెట్టేస్తే దీర్ఘకాలిక  నష్టమేదన్నా ఉంటే అది పుత్రరత్నం లోకేష్+టీడీపీకే. అందుకని తమ్ముళ్ళు తాము గెలిచే విషయాల గురించి ఆలోచించుకోకుండా జగన్-6093 నెంబరని, రవాణాసురుడని, బాబాయ్ ని హత్యచేయించాడని పదేపదే చెబుతున్నారంటేనే వీళ్ళ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. జగన్ మీదున్న ఆరోపణలను జనాలు పెద్దగా పట్టించుకోవటమే లేదన్న వీళ్ళకి ఎప్పటికి అర్ధమవుతుందో. జగన్ పైన అవినీతి ఆరోపణలను పట్టించుకోవటంలేదనటానికి మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లు రావటమే నిదర్శనం. కాబట్టి జగన్ పైన దృష్టి తగ్గించి ప్రజాసమస్యలపై  చంద్రబాబు అండ్ కో  ఆందోనళలు చేస్తే కొంతైనా జనాల మద్దతుపెరిగి ఓట్లుగా మారుతుందేమో ఆలోచించుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: