అమరావతి : వీళ్ళంతా టీడీపీకి జాకీలేస్తున్నారా ?

Vijaya



ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ రకరకాల మనుషులు, సంస్ధలు టీడీపీకి జాకీలేస్తున్నట్లు అర్ధమైపోతోంది.  ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పోరంకిలో జరిగిన కార్యక్రమానికి తమిళ సినిమా స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎన్టీయార్ ను పొగడటంతో ఊరుకోకుండా చంద్రబాబునాయుడు పరిపాలన బ్రహ్మాండమంటు కితాబిచ్చారు. దాంతో నెటిజన్లు, మంత్రులు, మాజీ మంత్రులు వెంటనే రియాక్టయ్యారు. మీడియా సమావేశాలుపెట్టి మంత్రులు, మాజీమంత్రులు వాయించేస్తే, నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపారేశారు.



ఇదే విధంగా ఈమధ్యనే ఒక టీవీ ఛానల్లో చంద్రబాబు బ్రహ్మాండమని, గొప్ప విజనరీ అని ప్రొజెక్టు చేసేందుకు ప్రయత్నించారు. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చేందుకు టీవీ ఛానల్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం పెరిగిపోయింది. ఒకవైపేమో గ్రౌండ్ లెవల్లో టీడీపీ గ్రాఫ్ పెద్ద పెరిగినట్లు కనబడటంలేదు. ఎందుకంటే పోరంకిలో జరిగిన ఎన్టీయార్ ఉత్సవాలకు జనాలు పెద్దగా హాజరుకాలేదు. మామూలుగానే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మవారి ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే.



అలాంటిది విజయవాడ సిటీకి ఆనుకుని ఉన్న ప్రాంతమే పోరంకి. ఇక్కడ ఏరికోరి టీడీపీ నేతలు ఎన్టీయార్ శతజయంతి పేరుతో భారీ ఉత్సవం జరిపితే ఉండాల్సినంత స్ధాయిలో జనాలు కనబడలేదు. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, రజనీకాంత్ హాజరైన ప్రోగ్రామ్ కు పెద్దగా జనాలు రాలేదంటే అర్ధమేంటి ? పదిమంది కమ్మ నేతలు తలచుకుంటే ఇంతకన్నా భారీసంఖ్యలో జనాలను తీసుకురాగలరు. అయినా జనాలు కనబడలేదంటే సభ పెద్దగా సక్సెస్ కాలేదని అర్ధమైపోయింది.



ఇక తాజాగా హైదరాబాద్ లోని గోషామహల్ బీజేపీ సస్పెండెడ్ ఎంఎల్ఏ రాజాసింగ్ తో మొదలుపెట్టించారు. చంద్రబాబు మంచి పరిపాలన చేశారని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీనే అని రాజాసింగ్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని చెబుతున్న టీవీ ఛానల్, రజనీకాంత్, రాజాసింగ్ లకు ఏపీతో ఎలాంటి సంబంధాలు లేవు. బహుశా రేపటి ఎన్నికల్లో రజనీ, రాజాసింగ్ టీడీపీకి మద్దతుగా ప్రచారంచేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏపీ ఎన్నికల్లో ప్రభావంచూపలేని వాళ్ళు టీడీపీకి ఎంత జాకీలేస్తే మాత్రం ఏమిటి ఉపయోగం ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: