అమరావతి : రామోజీకి ఉచ్చు బిగుసుకుంటోందా ? పట్టించిన జూమ్ ?

Vijaya




మార్గదర్శి చీటింగ్ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఛైర్మన్ రామోజీరావు చుట్టు ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకుంటోందా ? జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పిన ప్రకారం అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్య మార్గదర్శి బ్రాంచి ఆఫీసుల్లో సీఐడీ అధికారులు సోదాలుచేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఒక విషయాన్ని ఉన్నతాధికారులు గమనించారట. అదేమిటంటే కంప్యూటర్ల హార్డు డిస్కుల్లోని సమాచారంతో పాటు ఫిజికల్ ఫైల్స్ లోని సమాచారం కూడా మాయమైపోయిందట.



అది ఎలా జరిగిందనే విషయాన్ని సీఐడీ అధికారులతో పాటు వెళ్ళిన ఐటి నిపుణులు కూపీలాగారట. దాంతో విషయమంతా బయటపడిందని సమాచారం. ఇంతకీ ఏమి జరిగిందంటే సీఐడీ అధికారులు సోదాలు జరుపుతారనే ఉద్దేశ్యంతో మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ ఆఫీసు నుండి బ్రాంచీలకు ఆదేశాలు వచ్చాయట. అవేమిటంటే మొత్తం సమాచారాన్ని, ఫైల్స్ ను డెస్ట్రాయ్ చేయమని చెప్పారట. సమూలంగా ఫైల్స్ ను ఎలా డెస్ట్రాయ్ చేయాలో చూపించటం కోసం జూమ్  కాల్ ద్వారా డెమో కూడా ఇచ్చారట.



అంటే హెడ్ క్వార్టర్స్ లో ఫైల్స్ ను ఎలా ఎరేజ్ చేయాలో డెమోలో చూపిస్తుంటే దాన్నిచూసి బ్రాంచి ఆఫీసుల్లోని ఉద్యోగులు దాన్ని ఫాలో అయ్యారట. అయితే రామోజీకి మరచిపోయిన విషయం ఏమిటంటే హార్డ్ డిస్కుల్లో నుండి ఎరేజ్ చేసిన సమాచారన్ని తిరిగి రాబట్టే (రిట్రీవ్) నిపుణులుంటారని.



అలాంటి నిపుణులను పెట్టుకునే సీఐడీ ఎరేజ్ అయిపోయిన ఫైల్స్ ను తిరిగి తెప్పించారట. అదే క్రమంలో జూమ్ కాల్స్ ద్వారా మొత్తం ప్రక్రియను హెడ్ ఆఫీసునుండే నడిపించారని కూడా అర్ధమైపోయింది. ఇలాంటి చీపు ట్రిక్స్ ద్వారానే తాను తప్పులు చేస్తున్నట్లు, చేసిన, చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవాలని రామోజీ ప్రయత్నిస్తున్నట్లు మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 60 ఏళ్ళుగా ప్రభుత్వాలను మోసంచేసి వ్యాపారాలు చేసిందే కాకుండా ఇపుడు కూడా అవే మోసాలను కంటిన్యు చేస్తున్నట్లు మంత్రులు మండిపోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: