పోలీసులకు లొంగిపోయిన అమృత్‌పాల్ సింగ్!

Purushottham Vinay
ఖలిస్తాన్ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు దొరికేశాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. పంజాబ్‌లోని మోగా పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోవడం జరిగింది.అర్థరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసులకు సరెండర్ అయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రిలీజ్ చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వున్నాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినా కూడా అలా జరగలేదు. అలాగే మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అందువల్ల ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్.. ఇక పోలీసుల కళ్లుగప్పి పారిపోయే పరిస్థితి లేకపోవటంతో మోగా పోలీసుల ఎదుట అతను లొంగిపోయినట్లు తెలిసింది.ఖలిస్థానీ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేయడం జరిగింది. అయితే, లవ్‌ప్రీత్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24 వ తేదీన పెద్ద సంఖ్యలో అమృత్‌పాల్ సింగ్ అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. అందువల్ల లవ్‌ప్రీత్‌ను పోలీసులు వదిలివేయాల్సి వచ్చింది.


ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా బాగా చర్చనీయాంశంగా మారింది. యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్ పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో మార్చి 18 వ తేదీ నుంచి పోలీసులు అతనికోసం గాలింపు మొదలు పెట్టారు. అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ పోలీసులకు దొరక్కుండా పారిపోతూ వస్తున్నాడు.ఈ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారు వేషాల్లో తిరుగుతూ వచ్చాడు. మారువేషంలో ఢిల్లీ వీధుల్లో అమృత్ పాల్ తిరిగినట్లు సీసీ పుటేజీల్లో  కూడా రికార్డయ్యాయి. ఆ వీడియోల్లో అమృత్ పాల్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తలపాగా లేకుండా కనిపించాడు. అలాగే సన్ గ్లాసెస్ ధరించాడు. అయితే, అమృత్ పాల్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారన్న వార్తలు కూడా ఎక్కువగా వచ్చాయి. నేపాల్, పాకిస్థాన్ ఇంకా సింగపూర్ వంటి దేశాలకు అతను పారిపోవాలని ప్రయత్నించాడని కూడా తెలిసింది. అప్పటికే ప్రముఖ విమానాశ్రయాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు, సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఇంకా ఎస్ఎస్‌బీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అలాగే దీనికితోడు దేశవ్యాప్తంగా అమృత్ పాల్ కోసం పోలీసులు నిఘా ఉంచారు. దీంతో ఎటూ పారిపోలేని పరిస్థితుల్లో మళ్లీ అమృత్ పాల్ పంజాబ్ వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: