చైనాని వెనక్కునెట్టి నెం.1 అయిన ఇండియా?

Purushottham Vinay
ఇండియా హైయెస్ట్ పాపులేషన్ తో చైనాను బీట్ చేసి నెంబర్ వన్ గా నిలిచింది. ఈ విషయాన్నీ ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి. ఐక్యరాజ్యసమితి బుధవారం నాడు విడుదల చేసిన డేటా ప్రకారం..ఈ సంవత్సరం మధ్యలో 29 లక్షల జనాభాతో చైనా దేశాన్ని దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించినట్లు సమాచారం తెలుస్తోంది.స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌, 2023 (State of World population Report, 2023) పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (UNFPA) నివేదికను రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఇండియాలో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పేర్కొనడం జరిగింది. చైనా జనాభా 'స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023 పేరుతో ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన పాపులేషన్ డేటా ప్రకారం.. ఇండియా పాపులేషన్ 142.86 కోట్ల మంది ఉన్నారని.. అదే సమయంలో చైనా దేశంలో జనాభా 142.57 కోట్ల మంది అని సమాచారం తెలుస్తోంది. అయితే చైనా పాపులేషన్ ను ఇండియా ఎప్పుడు అధిగమించిందనేది స్పష్టం చేయలేదు. 2023 ఫిబ్రవరి దాకా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు సమాచారం తెలుస్తోంది.


ఇక ఇండియా , చైనా దేశాల తర్వాత 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడవ స్థానంలో ఉన్నట్లు డేటా నివేదికగా ద్వారా సమాచారం తెలుస్తోంది.8.045 బిలియన్ల ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనాభా ఇండియా, చైనా ఈ రెండు దేశాల్లోనే ఉన్నదని వెల్లడించింది. 
అయితే రెండు ఆసియా దిగ్గజ దేశాల్లో కూడా జనాభా పెరుగుదల మందగిస్తోందని పేర్కొంది. ఇది ఇండియాలో కంటే చైనాలో చాలా వేగంగా ఉంది. గత ఏడాది చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా చాలా దారుణంగా పడిపోయిందని తెలిపింది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక మలుపని.. పాపులేషన్ తగ్గుదల ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఇంకా అంతేకాదు చైనా జనాభా తగ్గుతూ వచ్చిందని అదే సమయంలో ఇండియాలో పెరుగుతోందని వెల్లడించింది. గత ఆరు దశాబ్దాలో మొదటిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. అయితే 2011 వ సంవత్సరం నుంచి ఇండియా జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: