అమరావతి : రామోజీ ప్రయత్నాలు ఇంత చీపుగా ఉన్నాయా ?

Vijaya



మార్గదర్శి చీటింగ్ కేసులో నుండి బయటపడేందుకు ఛైర్మన్ రామోజీరావు అందుబాటులో ఉన్న అన్నీ పద్దతులను అవలంభిస్తున్నారు. కోర్టులో కేసులు వేయటం ఒకటైతే తనకు మద్దతుగా వార్తలు రాసుకోవటం, సమాజంలోని ప్రముఖులతో మద్దతుగా ప్రకటనలు ఇప్పించుకోవటం. అయితే మరో ముఖ్యమైన పద్దతి ఏమిటంటే తనను విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్ధ సీఐడీని బెదిరించటం. సీఐడీని బెదిరించటం ద్వారా ఒత్తిడిలోకి నెట్టాలన్నది రామోజీ వ్యూహంగా కనబడుతోంది.



ప్రతిరోజు న్యాయవాదులు సీఏలతో రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టించి సీఐడీని బెదిరించేట్లుగా వాళ్ళతో ప్రకటనలిప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు లాయర్లు సీఐడీపై తొందరలోనే కేసులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. సీఐడీ మీద కేసులు ఎందుకంటే లాయర్లను వేధిస్తున్నదట. మార్గదర్శి ముసుగులో హవాలా, మనీల్యాండరింగ్ కు రామోజీ పాల్పడ్డారని, నిర్వహణంతా అవకతవకలే అంటు సీఐడీ చాలా ఆరోపణలుచేసింది. ఇవే ఆరోపణలపై రామోజీ, ఆయన కోడలు, సంస్ధ ఎండీ శైలజను విచారించింది.



ఈ నేపధ్యంలోనే సీఐడీ తన పరిధిని అతిక్రమించిందని, సంస్ధలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కొందరు లాయర్లు రామోజీకి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే  కొందరు లాయర్లు, సీఏలకు సీఐడీ నోటీసులిచ్చింది. రామోజీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పటానికి తమదగ్గరున్న ఆధారాలు ఏమిటో చెప్పాలని నోటీసుల్లో సీఐడీ అడిగింది. 15వ తేదీ అంటే శనివారం విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో చెప్పింది. ఈ మాత్రం దానికే కొందరు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజానికి ఈ ప్రయత్నాలన్నీ చాలా చీపుగా ఉన్నాయి.



ఎక్కడైనా నేరంజరిగినపుడు దానికి సంబంధించిన సమాచారం ఉంటే ఇవ్వమని దర్యాప్తుసంస్ధలు జనాలను అడగటం సహజమే కదా. ఇక్కడా అదే పద్దతిని సీఐడీ అనుసరించింది. లాయర్లు, సీఏలను తమదగ్గరున్న సమాచారాన్ని ఇవ్వమని అడిగింది. రామోజీ తప్పుచేశారని సీఐడీ అంటుంటే అదేమీలేదు ఆయన నిష్కళంకుడని లాయర్లు, సీఏలు సర్టిఫికేట్లిస్తున్నారు. క్లీన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు కాబట్టే ఏ ఆధారాలతో సర్టిఫై చేస్తున్నారో తెలుసుకునేందుకే వచ్చి కలవమని సీఐడీ నోటీసులిచ్చింది. ఇంతమాత్రానికే సీఐడీ తమను కూడా వేధిస్తోందంటు ఎందుకు గోలచేస్తాన్నారో అర్ధం కావటంలేదు.  సీఐడీపైన కోర్టుల్లో కేసులు వేస్తామంటు బెదిరిస్తున్నారు.  లాయర్లు, సీఏలను అడ్డంపెట్టుకుని  సీఐడీని రామోజీ ప్రభావితం చేసే ప్రయత్నం  కదా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: