ఢిల్లీ : కవితను భయంకరంగా ర్యాగింగ్ చేస్తున్న సుఖేష్ ..వెల్ కమ్ టు తీహార్

Vijaya
కేసీయార్ కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవితను ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ భయంకరంగా ర్యాగింగ్ చేస్తున్నాడు. తాజాగా శనివారం విడుదలచేసిన లేఖలో వెల్ కమ్ టు తీహార్ అన్నాడు. ‘కవితక్క..తీహార్ క్లబ్ కు వెల్ కమ్’ అని స్వాగతం పలికారు. ఇద్దరికీ అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవితను ఉద్దేశించి తొందరలోనే తీహార్ జైల్లో కలుద్దామని చెప్పారు. కేజ్రీవాల్ తర్వాత వంతు నీదే అంటు కవితను ఎద్దేవాచేశారు.వరుసబెట్టి విడుదలచేస్తున్న లేఖల్లో కవితను సుఖేష్ బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. మూడుసార్లు విచారించిన ఈడీ కూడా కవితను ఇంతగా టార్చర్ పెట్టలేదేమో. ఒక్కో లేఖలో ఒక్కో విధమైన వివరాన్ని విడుదలచేస్తు తనకు కవితకు మధ్య జరిగిన వాట్సప్ చాట్ ను, సన్నిహితాన్ని బహిర్గతం చేస్తున్నాడు. నాలుగురోజుల కిందట సుఖేష్ వాట్సప్ చాట్ విడుదలచేసిన విషయం తెలిసిందే. అందులో తాను రు. 15 కోట్లను అరుణ్ ద్వారా కవితకు అందించినట్లు చెప్పాడు.అయితే దాన్ని కవిత ఖండించారు. అసలు సుఖేష్ ఎవరో కూడా తనకు తెలీదన్నారు. సుఖేష్ అనే వ్యక్తిని తాను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. సుఖేష్ వాట్సప్ చాట్ కు కవిత సమాధానమిచ్చినట్లు చాటింగ్ స్క్రీన్ షాట్లలో సుఖేష్ చూపించాడు. అయితే అదంతా మార్ఫింగ్ చేసిన స్క్రీన్ షాట్లంటు కవిత స్పష్టంచేశారు. అందుకనే తాజా లేఖలో కవిత వ్యక్తిగత నెంబర్లను కూడా సుఖేష్ విడుదలచేశాడు. తానొక్కడే ఆర్ధిక నేరగాడు కాదని తనతో పాటు కేజ్రీవాల్, కవిత కూడా ఆర్ధిక నేరగాళ్ళే అని కన్ఫర్మ్ చేశాడు.
కవిత వాడిన వ్యక్తిగత నెంబర్లు 6209999999, 8985699999, 9810554102 గా సుఖేష్ లెటర్లో  స్పష్టంచేశాడు. కావాలంటే ఈ నెంబర్లు ఎవరో ఎవరైనా చెక్ చేసుకోవచ్చన్నాడు. తాను చెప్పిన విషయాలను ట్విట్టర్లో ఖండించటం చాలా పాత పద్దతిగా సుఖేష్ ఎద్దేవా చేశాడు. దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బృందాలకు కవిత సహకరించాలని కోరాడు. మొత్తానికి కవితను సుఖేష్ లెటర్ల రూపంలో అక్కా అక్కా అంటూనే  ఫుల్లుగా ర్యాగింగ్ చేసేస్తున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: