రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే.. రూ. 2 లక్షల నజరానా?

praveen
ఎన్నికలు వచ్చాయి అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే రేంజ్ లో సందడి నెలకొంటూ ఉంటుంది. అప్పటివరకు ప్రజలకు ఎక్కడ మొహం కూడా చూపించని రాజకీయ నాయకులందరూ కూడా ఒక్కసారిగా జనాల్లో వాలిపోయి వాళ్లలో ఒకడిగా కలిసిపోతూ ఉంటారు. ఏకంగా నేను మీ మనిషినే అని నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నికల సమయంలో ఏకంగా చిన్న పిల్లల ముడ్డి కడగడానికి.. అంట్లు తోమడానికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు సిద్ధం అవుతూ ఉండడం ఇప్పటివరకు ఎన్నో సార్లు చూసాము.

 అంతేకాదండో ఇక ఎన్నికలు మొదలయ్యాయి అంటే చాలు అటు అసాధ్యం అనుకున్న హామీలను కూడా సుసాధ్యం చేసి చూపిస్తాము అంటూ ఎన్నో హామీలను ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. ఇక ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది అని చెప్పాలి. ప్రతి పార్టీ కూడా గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు తెగ హామీలు ఇచ్చేస్తూ ఉంది. దీంతో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల ప్రచారాలు, భారీ ర్యాలీలో దర్శనమిస్తూ ఉన్నాయ్.  దీంతో కర్ణాటకలో వాతావరణం హాట్ హాట్ గానే కొనసాగుతూ ఉంది.

 ఈ క్రమంలోని ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇచ్చిన ఒక హామీ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కోలార్ లోని పంచరత్నలో జరిగిన ప్రచార ర్యాలీలో జెడిఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ తరపున  రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తాం అంటూ తెలిపారు. రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు ఇలాంటివి హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: