అమరావతి : రామోజీలో వణుకు మొదలైందా ?

Vijaya



రామోజీరావుదంతా మేకపోతు గాంభీర్యమని తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఇపుడు వణికిపోతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో తనకు  సరైనోడు ఎదురుపడలేదు కాబట్టి రామోజీ ఆటలు ఇష్టారాజ్యంగా సాగిపోయాయి. దాంతో తనకు ఎదురులేదని రామోజీ విర్రవీగారు. రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు ప్రత్యర్ధిగా మారిన జగన్మోహన్ రెడ్డిని రామోజీ చాలా తేలిగ్గా తీసుకున్నారు. తనకు అవసరంలేకపోయినా చంద్రబాబు ప్రయోజనాల కోసమే జగన్ను అనవసరంగా కెలికారు.



ఏదో పెద్దాయనకదాని జగన్ ఓపికపడితే దాన్ని చేతకానితనంగా చూశారు. ఒక్కసారిగా జగన్ ఎదురుతిరిగేటప్పటికి తట్టుకోలేక తల్లకిందులై మంచమెక్కేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్ధ వ్యాపారమంతా అక్రమ, అవినీతి పునాదుల మీదే లేచిందన్న విషయం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో వివరించారు. ఇదే విషయమై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. తన వ్యాపారాల్లోనే బోలెడన్ని అక్రమాలు, బొక్కలుపెట్టుకుని ఒంటికాలిపై జగన్ మీద ఎగిరెగిరి పడుతున్నారు. దాంతో రామోజీ వ్యాపారాల్లోని అక్రమాలు, బొక్కలను జగన్ ఒక చూపుచూడాలని అనుకున్నారు.



తాజాగా జరుగుతున్నసీఐడీ విచారణలో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారమంతా అక్రమాలు, అవినీతి, ఉల్లంఘనలే అని అందరికీ తెలిసిపోయింది. విచారణదెబ్బకు వణకు మొదలైంది. సీఐడీ విచారణ గనుక ఇలాగే సాగితే తనతో పాటు కోడలు శైలజ కూడా బుక్కయిపోవటం ఖాయమని అర్ధమైనట్లుంది. అందుకనే సీఐడీ విచారణను తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోర్టుల ద్వారా సాధ్యంకాదని తెలుసుకుని కేంద్రప్రభుత్వ రక్షణ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.



చిట్ ఫండ్ సంస్ధల సంఘం సలహాదారుడు శివరామకృష్ణన్ ను రంగంలోకి దింపారు. చిట్ ఫండ్ సంస్ధలపై విచారణ జరపాలంటే కేంద్ర ఆర్ధికశాఖలోని విభాగాలే దర్యాప్తు చేయాలనే వింత వాదన మొదలుపెట్టించారు. చిట్ ఫండ్ చట్టం-1982ని అమలుచేయటం వరకే కానీ ఆరోపణలపై దర్యాప్తుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదనే మతిలేని వాదన వినిపించారు. సీఐడీ విచారణను అర్జంటుగా నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు సలహాదారుడితో  విజ్ఞప్తి చేయించారు. ఇదే విజ్ఞప్తిని తానుచేస్తే భయపడుతున్నట్లు ప్రపంచానికి తెలిసిపోతుందని భావించిన రామోజీ సలహాదారుడితో చేయించారు. దీంతోనే రామోజీలో వణుకు స్పష్టంగా అందరికీ అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: