హైదరాబాద్ : ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటలు సాగలేదా ?

Vijaya
మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ఛైర్మన్ ఎన్ని డ్రామాలు ఆడినా సీఐడీ విచారణను తప్పించుకోలేకపోయారా ? జగన్మోహన్ రెడ్డి మీడియా సమాచారం ప్రకారం అవుననే అనుకోవాల్సొస్తోంది. సదరు మీడియా ఇచ్చిన సమాచారం ఏమిటంటే చిట్ ఫండ్ మోసాలపై రామోజీరావు ఏ1, రామోజీ కోడలు శైలజపై  ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసింది. వీళ్ళిద్దరినీ విచారించేందుకు నాలుగు తేదీలను, ప్లేసును కూడా చెప్పమని వాళ్ళనే అడిగింది.ఏప్రిల్ 3వ తేదీన ఫిల్మ్ సిటీలోని తన నివాసానికి వచ్చి విచారించుకోవచ్చని రామోజీ సీఐడీకి బంపరాఫర్ ఇచ్చారు. అయితే మరుసటిరోజే ఫిల్మ్ సిటీకి వద్దని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి రావాలని మరో సమాచారం పంపారు. జూబ్లీహిల్స్ నివాసంలోనే శైలజ కూడా ఉంటారని చెప్పారట.  రామోజీ చెప్పినట్లుగానే సీఐడీ అధికారులు సోమవారం ఉదయం రామోజీ ఇంటికి చేరుకున్నారు. అయితే తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని సమాధానమిచ్చారట. వైద్యపరీక్షలకు వెళ్ళాలని చెప్పారట.అయితే ఈ విషయాన్ని సీఐడీ ఉన్నతాధికారులు ముందుగానే ఊహించినట్లున్నారు. అందుకనే తమతో పాటు డాక్టర్ల బృందాన్ని కూడా వెంటపెట్టుకుని వెళ్ళారు. దాంతో రామోజీని ఆయనింట్లోనే సీఐడీ డాక్టర్లు పరీక్షించి ఎలాంటి అనారోగ్యంలేదని తేల్చేశారట. వెంటనే తాను ఎక్కువసేపు కూర్చోలేనని కాబట్టి పడుకునే ఉంటానని చెప్పారట. తాను మంచంమీద పడుకునే విచారణకు హాజరవుతానని చెప్పారట. దానికి అధికారులు సరేనని చెప్పి విచారణ మొదలుపెట్టారు.ఇక్కడ గమనించాల్సిందేమంటే తనకు అనారోగ్యంగా ఉందని చెప్పిన రామోజీ చికిత్స తీసుకుంటున్న ఆనవాళ్ళు మాత్రం ఏమీలేవు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ప్రకారం హాస్పిటల్లో ఉండే బెడ్ లాంటిదానిపై ఆయన పడుకుని ఉన్నారు. నిజంగానే ఆయనకు తీవ్ర  అనారోగ్యంగా ఉంటే బెడ్ పక్కన  ఆక్సిజన్ సిలిండర్ లేదు.  బీపీ మానిటర్ కనబడలేదు. చివరకు స్టాండ్ కనబడుతోంది కానీ దానికి సెలైన్ బాటిల్ కూడా లేదు. సీఐడీ విచారణ అనేసరికి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగినట్లు జగన్ మీడియా ఆరోపించింది. అయితే ఇవన్నీ ముందుగా ఊహించటం వల్లే సీఐడీ కూడా అన్నీ ఏర్పాట్లతో రామోజీ ఇంటికి వెళ్ళింది. దాంతో ఇక లాభంలేదనుకుని పడుకునే విచారణను ఎదుర్కోవాల్సొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: