హైదరాబాద్ : కాంగ్రెస్-బీజేపీ చేతులు కలుపుతాయా ?

Vijaya




వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతిపాదన చాలా విచిత్రంగా ఉంది. వినటానికే విచిత్రంగా ఉన్న ఈ ప్రతిపాదనను షర్మిల ఎలా చేయగలిగారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే కేసీయార్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలపాలని. టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ప్రతిపక్షాలన్నీ ఏకమైతే కానీ కేసీయార్ లొంగిరారని చెప్పి షర్మిల ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డ, అటు బండి సంజయ్ కు ఫోన్లో మాట్లాడారు.



ప్రతిపక్షాలు ఐకమత్యంతో ఉంటేకానీ అధికారపార్టీని లొంగదీసుకునే అవకాశం లేదన్నది నూరుశాతం నిజమే. అయితే అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు ఏ విధంగా ఏకమవుతాయని షర్మిల అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి రావటం తథ్యమని బీజేపీ, కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఎన్నికలు పెట్టడం, పోలింగ్ జరగటం, కేసీయార్ దిగిపోవటం తాము అధికారంలోకి వచ్చేయటమే మిగులుందని బండి సంజయ్, రేవంత్ ఎవరికి వాళ్ళు చెప్పేసుకుంటున్నారు.



ఇలాంటి నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీలు కేసీయార్ కు వ్యతిరేకంగా చేతులు కలిపే అవకాశాలు లేవుగాక లేవు. ఎవరికి వారుగా పోరాటాలు చేసి కేసీయార్ ను అధికారంలోకి దింపేయబోతున్నట్లు ఇద్దరు అధ్యక్షులు అనుకుంటున్నపుడు ఇక ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని కదా వాళ్ళ భావన. అలాంటపుడు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చే అవకాశమే లేదు.



ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాననే ప్రచారం ద్వారా షర్మిల హైలైట్ అవ్వాలని అనుకుంటున్నట్లున్నారు. అంతేకానీ తన ప్రతిపాదనలో గ్రౌండ్ రియాలిటి తెలీక కాదు షర్మిల ప్రయత్నించింది. ప్రతిపాదన పేరుతో ప్రచారం పొందటమే షర్మిల ముందున్న టార్టెట్ గా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాలు అన్నీ కలవకపోతే కేసీయార్ ఏ పార్టీని కూడా బతకనివ్వడన్న షర్మిల ఆందోళన నిజమే కావచ్చు. కానీ ఇపుడు ఉనికి కోసం పోరాటం చేస్తున్నది షర్మిల మాత్రమే అని అందరికీ తెలుసు. తెలంగాణాలో ప్రతిపక్షాలను కేసీయార్ చంపేది లేదు జీవం పోసేదీ లేదు. సమస్య ఏదన్నా ఉంటే అది షర్మిలకు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: