హైదరాబాద్ : చంద్రబాబు ముందు ‘లై డిటెక్టర్’ కూడా పనికిరాదా ?

Vijaya


ఎవరిచేతనైనా నిజాలు చెప్పించాలంటే దర్యాప్తు అధికారులు వాళ్ళకి లై డిటెక్టర్ టెస్టు చేయిస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలను జనాలు సినిమాల్లో చూసుంటారు. లై డిటెక్టర్ టెస్టు చేసినంత మాత్రాన నిజాలన్నీ తన్నుకువచ్చేస్తాయని కాదు. చెప్పే విధానాన్ని బట్టి  చెప్పేవన్నీ నిజాలా లేకపోతే అబద్ధాలా అన్నది చాలావరకు తెలిసిపోతుంది. ఇదంతా ఇపుడు ఎందుకంటే తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ సభ హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగింది.



ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడింది విన్న తర్వాత లై డిటెక్టర్ టెస్టులో కూడా చంద్రబాబు దొరకరు అని అనిపించింది. అంటే తేలిగ్గా అబద్ధాలను కూడా నిజమే అన్నట్లుగా చెప్పేస్తుంటారు.   ఇపుడు చంద్రబాబు చెప్పిందేమిటంటే హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశారట. అంటే చంద్రబాబు సీఎం కాకముందు హైదరాబాద్ లో అసలు అభివృద్ధి అనేదే లేదన్నట్లుగా మాట్లాడారు.



హైటెక్ సిటీని తాను కట్టానని చెప్పారు. ఇదిపూర్తిగా అబద్ధం. ఎందుకంటే హైటెక్ సిటి నిర్మాణానికి శంకుస్ధాపన చేసింది నేదురుమల్లి జనార్ధనరెడ్డి. తర్వాత ఎప్పుడో ఆరేళ్ళకు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తనకున్న మీడియా మద్దతువల్ల తానే డెవలప్ చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. ఔటరింగ్ రోడ్డును డెవలప్  చేసింది దివంగత సీఎం వైఎస్సార్. దీనికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు. శంషాబాద్ విమానాశ్రయానికి చంద్రబాబు భూసేకరణ మాత్రమే చేశారు. నిర్మాణం మొదలుపెట్టి పూర్తిచేసింది వైఎస్సారే. కానీ శంషాబాద్ విమానాశ్రమం తన పుణ్యమే అని చెప్పేసుకుంటున్నారు.



జినోమ్ వ్యాలీని ఏర్పాటుచేసి ఫార్మా రంగాన్ని బాగా డెవలప్ చేసినట్లు చెప్పింది తప్పు. ఎందుకంటే 1980 ప్రాంతంలోనే ఐడీపీఎల్ పేరుతో హైదరాబాద్ లో ఫార్మాకంపెనీలున్నాయి. మెట్రో ప్రాజెక్టును  వైఎస్ చెడిగొడితే రోశయ్య గాడిన పెట్టారట. మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందే వైఎస్. అంతకుముందు మెట్రో ప్రాజెక్టులేదు. వైఎస్సార్ మరణం తర్వాత మొదలైన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ప్రాజెక్టును ఎవరు పట్టించుకోలేదు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించానని ఎవరు చెప్పకపోయినా పర్వాలేదట. తాను నిర్మిస్తే కదా చెప్పటానికి.



30 ఇంజనీరింగ్ కాలేజీలను 300కి పెంచినట్లు చెప్పింది కరెక్టే. ఎవరికోసం, దేనికోసం పెంచినా ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య పెరిగింది నిజమే. దావోస్ కు పదిసార్లు తిరిగి పరిశ్రమలను తెచ్చానని చెప్పింది అబద్ధమే. బిల్ గేట్స్ తో మాట్లాడి హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ చేశానని చెప్పారు. హైదరాబాద్ ఐఎస్బీ ఏర్పాటుచేశానని చెప్పింది నిజమే. చంద్రబాబు ఇంకా ఇలాంటివి చాలా చెప్పారు. వీటన్నింటిలో ఏది నిజం ? ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే లై డిటెక్టర్ టెస్టు చేసినా ఉపయోగముండదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: