అమరావతి : టీడీపీ ఎంఎల్సీ సీటును ఎలా గెలిచిందో తెలుసా ?

Vijaya




గెలుపు అవకాశాలే లేని ఎన్నికలో అభ్యర్ధిని నిలిపి చంద్రబాబునాయుడు విజయం సాధించారు. ఇపుడిదే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఎల్లోమీడియా తాజా ఫలితాలను చంద్రబాబు చాణుక్యంగా బాగా హైలైట్ చేస్తోంది. చంద్రబాబుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సినిమా డైలాగులు అచ్చేస్తోంది. ఎన్నికల్లో ఎలా గెలిచామన్నది ముఖ్యంకాదు గెలిచామా లేదా అన్నదే ముఖ్యమన్నది చంద్రబాబు పద్దతి. ఆ పద్దతిలో చూస్తే టీడీపీది గొప్ప విజయమనే అనుకోవాలి.



సీన్ కట్ చేస్తే 2014-19 మధ్యలో వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. రకరకాల ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి ఫిరాయించేట్లు చేశారు. వారిలో నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. చివరకు ఏమైంది ? 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచింది 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో అయినా పద్దతిగా ఎలక్షనీరింగ్ చేస్తారని అనుకుంటే చంద్రబాబు బుద్ధి ఏమీ మారలేదని తేలిపోయింది.



తాజాగా జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో మళ్ళీ ఇద్దరు వైసీపీ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేశారు. ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలకు అదనంగా మరో ఇద్దరు ఎంఎల్ఏలను కొన్నట్లు అర్ధమవుతోంది. వచ్చేఎన్నికల్లో టికెట్లు+ఎన్నికల ఖర్చులను ఆశచూపించి గాలమేశారనే ప్రచారం పెరిగిపోతోంది.



అంటే 2019 ఎన్నికల్లో మాడుపగిలినా చంద్రబాబు బుద్ధి మారలేదని అర్ధమవుతోంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళని కొనేయటం, ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించటమే తప్ప సొంతబలాన్ని నమ్ముకోవటం ఏనాడూ లేదని మరోసారి రుజువైంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబుతో పడలేదు. అందుకనే వాళ్ళు పార్టీకి దూరమయ్యారు. దూరమైన ఎంఎల్ఏలు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. కానీ చంద్రబాబు చేసింది అలాకాదు. జగన్ తో పడక ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు చంద్రబాబుకు దగ్గరయ్యారు. కాబట్టి వీళ్ళతో ఓట్లేయించుకోవటంలో తప్పులేదు. కానీ మరో ఇద్దరు ఎంఎల్ఏలను కూడా ప్రలోభాలకు గురిచేసి ఓట్లను వేయించుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి గెలవటాన్ని గొప్ప విజయంగా పండగ చేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: