అమరావతి : మంత్రులకు జగన్ స్వీట్ వార్నింగ్

Vijaya
క్యాబినెట్ సమావేశం తర్వాత పిచ్చాపాటీ మాటల్లో మంత్రులకు జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగే ఇచ్చారు. పనితీరు బావోలేని మంత్రులను తప్పించేయటం ఖాయమన్నారు. మరో పద్నాలుగా నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో తొందరలోనే మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలిసిందే.  ఎన్నికలకు ముందుగా చివరగా పాత, కొత్తల మేలుకలయికతో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు సమాచారం.జగన్ వార్నింగు చూసిన తర్వాత ఉండేదెవరో, ఊడేదెవరో తొందరలోనే తేలిపోతుంది. ఇప్పటి మంత్రుల్లో కొందరు మరీ డమ్మీలుగా మారిపోయారు. వాళ్ళ శాఖల్లో ఏమి జరుగుతోందో కూడా తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంమీద ఐదుగురికి ఉధ్వాసన తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జూలై నెలలో అందరం విశాఖపట్నంకు మారబోతున్నట్లు స్వయంగా జగనే మంత్రులకు చెప్పారు.జూలైలో విశాఖనుండే పాలన మొదలుపెట్టబోతున్నట్లు జగన్ ప్రకటించారు. అంటే ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు ఉగాదికి వైజాగ్ షిఫ్ట్ కావటంలేదనే విషయంలో క్లారిటి వచ్చేసింది. ఇప్పటివరకు జగన్ అప్పుడు వైజాగ్ వెళిపోతారు, పలానా తేదీకి షిఫ్టయిపోతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇపుడు స్వయంగా జగనే ప్రకటించారు కాబట్టి ఇక కన్ఫ్యూజన్ అవసరంలేదు. జగన్ ప్రకటనకు తగ్గట్లే మంత్రులు కూడా షిఫ్టింగుకు రెడీ అయిపోతున్నారు. ఇక చివరగా ఎంఎల్సీ ఎన్నికల్లో విజయం గురించి స్పష్టంగా చెప్పేశారు. అన్నీ స్ధానాల్లోను వైసీపీయే గెలవాలని మంత్రులందరినీ జగన్ హెచ్చరించారు.మంత్రివర్గం ప్రక్షాళనకు ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపోటములను కూడా జగన్ బెంచ్ మార్కుగా తీసుకున్నట్లు అర్ధమవుతోంది. వైసీపీ అభ్యర్ధులకు వివిధ జిల్లాల్లో ఎన్నెన్ని ఓట్లు పడ్డాయన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. దీన్నిబట్టే అభ్యర్ధుల గెలుపుకు ఆయా జిల్లాల్లోని మంత్రులు ఎంతగా కష్టపడింది లెక్కలతో సహా తేలిపోతుంది.  అభ్యర్ధులు గెలిస్తే ఓకే. అదే ఓడిపోయినా, నానా అవస్తలుపడి గెలిచినా అది మంత్రుల ఫెయిల్యూర్ గా అర్ధమైపోతుంది. దీన్నిబట్టి మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి ? ఎవరిని తప్పించాలి ? అనేది జగన్ నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి ఎంఎల్సీ ఎన్నికలే మంత్రులకు పెద్ద గండంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: