అమరావతి : సమ్మిట్ తర్వాత జగన్ కీలక ఆదేశాలు

Vijaya


ఇటీవలే ముగిసిన రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. సదస్సులో అనేకమంది ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్న విషయం తెలిసిందే. ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, గ్రంధి మల్లికార్జునరావు లాంటి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. మొత్తం 378 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వీటి విలువ రు. 13.5 లక్షల కోట్లు.ఇక్కడే జగన్ కీలకమైన ఆదేశాలు జారీచేశారు. అదేమిటంటే ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలతో రెగ్యులర్ గా ఫాలో అప్ ఉండాలని. ఎంవోయూలు కుదుర్చుకోవటం కాదు చేసుకున్న ఎంవోయూలు ఆచరణలోకి రావాలని జగన్ గట్టిగా చెప్పారు. ఈ ఫాలోఅప్ కోసం ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటిని కూడా నియమించారు. ఈ కమిటి ప్రతివారం కంపెనీల యాజమాన్యాలతో టచ్ లో ఉంటారు. అలాగే ప్రతినెలా రెండు లేదా మూడు కంపెనీలు గ్రౌండింగ్ జరగాలని జగన్ స్పష్టంగా ఆదేశించారు.ఏ ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు జరిపినా జరిగేదేమిటంటే ఎంవోయులు కుదుర్చుకోవటం. ఎంవోయూలు కుదర్చుకోవటం, ప్రచారం చేసుకోవటంతోనే సరిపోతుంది. వీటిని ఫాలో అప్ చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు. యాజమాన్యాలు కూడా అవసరమైన ప్రచారం వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇటువైపు తిరిగికూడా చూడవు. చేసుకున్న ఎంవోయూలన్నీ ఆచరణలోకి రావాలని ఏమీలేవు. కొన్ని వస్తాయి చాలావరకు పెండింగ్ లోనే పడిపోతాయి.చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన పెట్టుబడుల సదస్సులన్నీ ఇదేబాపతు.  అందుకనే టీడీపీ హయాంలో జరిగిన ప్రచారం మాత్రం విపరీతం. చివరకు గ్రౌండ్ అయిన యూనిట్లు మాత్రం దాదాపు లేవనే చెప్పాలి. ఇపుడు అలాకాకుండా నిజంగానే పరిశ్రమలు గ్రౌండ్ కావాలని జగన్ బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ప్రచారం కోసమైనా యూనిట్లను గ్రౌండ్ చేయించాల్సిన బాధ్యత జగన్ పైన పడింది. అందుకనే ప్రతివారం ఫాలోఅప్ చేయాలని, ప్రతి నెలా రెండు, మూడు యూనిట్లు గ్రౌండ్ అయ్యేట్లు చూడాలని ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటి వేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: