రాయలసీమ : లోకేష్ ప్రకటనలు చెల్లుబాటవుతుందా ?

Vijaya


పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ వరుసగా అభ్యర్ధులను ప్రకటించుకుంటు వెళుతున్నారు. ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తుంటే మరోవైపు వాళ్ళపై పార్టీలో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదంతా చూసిన తర్వాత ఇపుడు లోకేష్ చేస్తున్న ప్రకటనలు చెల్లుబాటవుతాయా అనే సందేహాలు తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. ఈ సందేహానికి కారణం ఏమిటంటే లోకేష్ ప్రకటించిన అభ్యర్ధుల్లో చాలామందికి నియోజకవర్గాల్లో పెద్దగా పట్టులేకపోవటమే. అభ్యర్ధుల ప్లస్సులు మైనస్సులు లోకేష్ కన్నా నియోజకవర్గాల్లోని నేతలకే ఎక్కువ తెలుస్తాయి.అభ్యర్ధుల ప్రకటనకు ముందు ఆయా నియోజకవర్గాల్లోని నేతల అభిప్రాయాలు తీసుకోకుండా లోకేష్ ప్రకటన చేస్తుండటమే వివాదానికి కారణమవుతోంది. ఆదివారం పాదయాత్రలో భాగంగా పీలేరులో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి నల్లారి కుటుంబానికి నియోజకవర్గంలో పెద్ద పట్టులేదు. ఏదో చివరినిముషంలో ఇతరులతో సర్దుబాటు చేసుకుని నల్లారి కిరణ్ కుమార్ గెలుస్తుండే వాడు.ఇపుడు లోకేష్ ప్రకటించిన కిషోర్ మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడే. రెండురోజుల క్రితం పుంగనూరులో చల్లాబాబును ప్రకటించారు. వెంటనే ప్రకటనపై నేతల్లోనే అసంతృప్తి మొదలైపోయింది. చంద్రగిరిలో పులివర్తి నాని గెలుస్తాడనే నమ్మకం ఎవరిలోను లేకపోయినా లోకేష్ మాత్రం అభ్యర్ధిగా  ప్రకటించేశారు. లోకేష్ ఇలాగ ప్రకటించాడో లేదో వెంటనే కొందరు తమ్ముళ్ళు ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పేస్తున్నారట. ఇక సత్యవేడులో డాక్టర్ హెలెన్ అంటే తీవ్రంగా మండిపోతున్నారు తమ్ముళ్ళు. లోకేష్ ఏమో ఆమెనే అభ్యర్ధిగా ప్రకటించారు.శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డిని  అభ్యర్ధిగా ప్రకటిస్తే లాభంలేదని తమ్ముళ్ళే చెప్పేస్తున్నారట. నగిరిలో గాలి భానుప్రసాద్ నాయుడు పర్వాలేదు. ఈయనకు ఎన్ని మైనస్సులున్నాయో మంత్రి రోజాకూ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎన్నికల నాటికి ఎవరు మైనస్సులను తగ్గించుకుంటారో వాళ్ళదే గెలుపు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాధరెడ్డి అభ్యర్ధిత్వం వరకు బాగానే ఉంది. అంటే తమ్ముళ్ళ ఫీడ్ బ్యాక్ ప్రకారమే లోకేష్ ప్రకటించిన ఏడుగురిలో ఇద్దరే పర్వాలేదన్నట్లుగా ఉన్నారు. అయినా చంద్రబాబునాయుడు అనుమతి లేకుండానే లోకేష్ అభ్యర్దులను ప్రకటించగలడా ? మరి చివరినిముషంలో కొందరు అభ్యర్ధులను చంద్రబాబు మార్చేస్తే లోకేష్ పరువు ఏమైపుతుందబ్బా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: